పోలింగ్ కు అంతా రెడీ..రేపే లోక్ సభ ఎన్నికలకు ఓటింగ్

  • రాష్ట్ర వ్యాప్తంగా 34,604 పోలింగ్కేం ద్రాలు
  • ఉదయం 7 నుంచిసాయంత్రం 5 వరకు పోలింగ్
  • నిజామాబాద్ ఉదయం 8 నుం చి సాయంత్రం 6 వరకు
  • 17 లోక్సభ స్థా నాల్లో 443 మంది బరిలో

లోక్ సభ ఎన్నికలకు రాష్ట్రంలో అంతా సిద్ధమైంది. గురువారం నాటి పోలింగ్ కు ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 34,604 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసింది.వీటిలో 6,445 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించింది. 79,882 ఈవీఎంలు, 42,853 కంట్రోల్యూనిట్లు , 46,731 వీవీప్యాట్లు ఎన్నికలకు వినియోగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2.97 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గురువారంఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల్లో రెండు లక్షలమందికి పైగా సిబ్బంది విధుల్లో పాల్గొ ననున్నా రు.రాష్ట్రవ్యాప్తంగా 4,169 వెబ్ స్టింగ్‌ సెంటర్లున్నా యి. మిగతా చోట్ల వీడియో రికార్డింగ్‌ చేయనున్నారు. ఇప్పటికే వంద శాతం ఎపిక్‌ కార్డులు, ఓటరుస్లిప్పుల పంపిణీ పూర్తయింది. దివ్యాంగుల కోసం బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేశారు. 17లోక్ భ నియోజకవర్గాల పరిధిలో 443 మందిఅభ్యర్థులు బరిలో ఉన్నా రు. అత్యధికంగా నిజామాబాద్ స్థానానికి 185 మంది, అత్యల్పంగా మెదక్‌ సీటుకు 10 మంది బరిలో ఉన్నారు. నిజామాబాద్ పార్లమెం ట్ నియోజకవర్గం లో 185 మంది బరిలోఉండటంతో 56 పేజీల బ్రెయిలీ లిపి బ్యాలెట్ ప్రింట్ చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగ ఓటర్లకు ర్యాంప్ లు, వీల్ ర్లతో పాటు ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నారు.

4 గంటల వరకే పోలింగ్

ఐదు లోక్ సభ స్థానాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం4 వరకే పోలింగ్‌ జరుగుతుంది. వీటిలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్‌, ఆసిఫబాద్‌,చెన్నూర్‌, బెల్లం పల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం,కొత్తగూడెం, అశ్వారావుపేట ఉన్నాయి. నిజామాబాద్ లో మాత్రం ఉదయం 8 గంటల నుంచిసాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ ఉంటుంది.అక్కడ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తారు.

48 గంటలు మద్యం బంద్‌: సోమేశ్

రాష్ట్రంలో 48 గంటలు మద్యం దుకాణాలు మూసే-యాలని ఎక్సైజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సోమేశ్ కుమార్‌ఆదేశించారు. లిక్కర్ అమ్మితే షాప్ లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ‘ఇప్పటివరకు 3.32 కోట్లువిలువైన 2.72 లక్షల లీటర్ల మద్యం సీజ్ చేసి2,149 మందిని అరెస్టు చేశాం. 3,780 లిక్కర్ కేసులు నమోదు చేశాం. 1,267 మందిని బైండోవర్ చేశాం’ అని చెప్పారు.

నిజామాబాద్ ప్రత్యేకంగా

నిజామాబాద్‌ లోక్ సభ స్థానంపై ఈసీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. 185 మంది అభ్యర్థుల పేర్లు, ఫొటోలు, వివరాలతో ముద్రించిన 12బ్యాలెట్ యూనిట్లను ఎల్‌ ఆకారంలో అమర్చనున్నారు. ఈ సెగ్మెంట్ లో 1,788 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐదు కేంద్రాలకు ఒకరి చొప్పున 357 మంది సెక్టోరి యల్‌ అధికారులతో పాటు400 మంది ఇంజినీర్లు విధుల్లో పాల్గొంటున్నా రు.ఎలాంటి సమస్య తలెత్తినా 15 నిమిషాల్లో అక్కడికిచేరుకుంటారు.

70 వేల మందిపోలీసుల భద్రత: డీజీ జితేందర్‌

ఎన్నికలకు 70 వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని అడిషనల్‌ డీజీ జితేందర్‌ చెప్పారు. 410 ఫ్లయిం గ్ స్క్వాడ్ లు సిద్ధంగా ఉన్నాయన్నారు. డీజీపీ ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల పరిశీలనకు ఈసీఐ నుంచి కేపీ శర్మ ప్రత్యేక ప్రతినిధిగా వస్తున్నా రని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీఆర్‌పీఫ్‌ బలగాలతో భద్రత కల్పిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్, ఐటీ శాఖ తనిఖీల్లో ఇప్పటివరకు రూ. 62.34 కోట్ల విలువైన సొత్తు ను పట్టుకున్నా రు.

Latest Updates