నిజామాబాద్​ కోసం భారీ బ్యాలెట్ బాక్సులు

Election Commission Special Focus on Nijamabad MP Elections

హైదరాబాద్, వెలుగు: పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలైన నిజామాబాద్ లోక్ సభ స్థానంపై ఎన్నికలసంఘం ప్రత్యే కంగా దృష్టి సారించింది. 245 మందినామినేషన్లు వచ్చాయని, 200కిపైగా పోటీలోనిలిచినా ఎన్నికకు సమస్యేమీ లేదని రాష్ట్ర ఎన్నికలప్రధానాధికారి (సీఈవో) కార్ యాలయంలోని అధికారిఒకరు వెల్లడించారు. 28వ తేదీ వరకు నామినేషన్లఉప సంహరణ గడువు ఉందని, ఆ తర్వాత ఎంతమంది పోటీలో ఉంటారు, ఎన్ని గుర్తులు అవసరం,ఇతర ఏర్పాట్లు ఏమేం అవసరమన్న స్పష్ట త వస్తుం-దని తెలిపారు. గుర్తింపు పొందిన పార్టీల గుర్తులుపోగా మరో 194 గుర్తులు సిద్ధంగా ఉన్నాయని, మరి-కొన్న ింటి కోసం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిఅడుగుతామని చెప్పారు.

తెలుగు అక్షరాల క్రమంలోనే..

పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ఇంగ్లిష్ లో అల్ఫాబెటికల్ ఆర్డర్ లో కాకుం డా తెలుగు అక్షరాల క్రమంలో చూస్తామని ఈసీ అధికారి తెలిపారు. అంటే తెలుగు అక్షరాల లెక్కన అ, ఆ, ఇ, ఈ.. క, ఖ, గ.. లాగా ఆర్డర్ చూసి, బ్యాలెట్​ పేపర్ పై అభ్యర్థుల వరుస క్రమాన్ని నిర్ణయిస్తారు. ఉదాహరణకు నిజామాబాద్ లో పోటీలోఉన్న మధుయాష్కీ, అరవింద్, కవిత పేర్లలో.. మొదట అరవింద్ పేరు, తర్వాత కవిత, మధుయాష్కీ వస్తారు.అయితే నామినేషన్ లో అభ్యర్థులు తమ పేరు రాసే విధానాన్ని బట్టి కూడా ఆర్డర్ మారుతుంది. అరవింద్ తన ఇంటిపేరుతో సహా ‘ధర్మపురి అరవింద్’అని రాస్తే.. ఇందులో ‘ధ’అనే అక్షరాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అదే ‘అరవింద్ ధర్మపురి’అని రాసి ఉంటే. . ‘అ’అనే అక్షరాన్ని తీసుకుంటారు. ఇలా కాకుం డా ‘డి.అరవింద్’అని రాసినా కూడా ‘అ’అనే అక్షరాన్ని తీసుకుంటారు. ఎందుకంటే ‘డి.అరవిం-ద్’అని రాస్తే.. ఇంటిపేరుగా ఉన్నది ఇంగ్లిష్ అక్షరం కాబట్టి లెక్కలోకి తీసుకోరు.

మూడు గ్రూపులుగా అభ్యర్థులు

ఈవీఎం లేదా బ్యాలెట్​ పేపర్ పై అభ్యర్ ల పేర్లను మూడు గ్రూపులుగా ఏర్పాటు చేస్తారు. ముందుగా గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు, తర్వాత రిజిస్టర్డ్​ పార్టీల వారు, చివరిగా ఇండి-పెండెంట్లు ఉంటారు. ఈ మూడు గ్రూపుల్లో నూ ఒక్కోగ్రూపులోని అభ్యర్థుల పేర్లను తెలుగు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఏర్పాటు చేస్తారు.

ప్రత్యేకంగా పెద్ద బ్యాలెట్ బాక్సులు

బ్యాలెట్​ పేపర్ భారీగా ఉండే నేపథ్యం లో ప్రత్యే-కంగా బ్యాలెట్​ బాక్సులు తయారు చేయించాల్సి ఉంటుం దని ఈసీ అధికారి తెలిపారు. నిజామాబాద్ లోక్ సభ స్థానం పరిధిలో 1,880 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 2,000 వరకు బాక్సులు అవసరమవుతాయని చెప్పారు. వీటి కోసం కోటి రూపాయలకుపైగాఖర్చవుతుందన్నారు. నామినేషన్ల ఉప సంహరణతర్వాత మిగిలే అభ్యర్ థులెందరు, ఇతర పరిస్థి తులుఏమిటన్న దానిపై కేంద్ర కేంద్ర ఎన్నికల సంఘానికిరిపోర్టు పంపుతామని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు.

భారీ బ్యాలెట్..

మొత్తం 245 మంది పోటీలో మిగిలారను-కుంటే.. వారందరి పేర్లు వరుసగా ప్రింటింగ్​ చేయబోమని ఈసీ అధికారి చెప్పారు. కేంద్రఎన్నికల సంఘం ఇచ్చే సూచనను బట్టి 16మందికో బ్యాలెట్​గా నీ, 24 మందికో బ్యాలెట్చొప్పునగానీ ప్రింట్​ చేస్తామని, ఇలా మొత్తంఅభ్యర్ థుల సంఖ్యకు తగినట్టుగా బ్యాలెట్​ పేపర్లు సిద్ధం చేస్తామని తెలిపారు. బ్యాలెట్లోఒక్కో అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు, ఫోటో, వారిగుర్తు ఉంటాయన్నారు.

Latest Updates