మోడీపై కామెంట్స్..సిద్ధూకు ఈసీ నోటీసులు

ఢిల్లీ:  మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. అహ్మదాబాద్‌లో ఏప్రిల్ 17న జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత కామెంట్స్ చేసినందుకు ఈసీ నోటీసులు జారీ చేసింది. తన కామెంట్స్ పై వివరణ ఇవ్వాలంటూ ఈసీ బుధవారం నోటీసు జారీ చేసింది. బీజేపీ నేత నీరజ్ చేసిన ఫిర్యాదు క్రమంలో ఈసీ ఈ నోటీసులు పంపుతూ, గురువారం సాయంత్రం 6 గంటల లోపు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ సిద్ధూను ఆదేశించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ర్యాలీలో మోడీని దేశంలోనే ‘అతి పెద్ద అబద్ధాల కోరు’ అన్నారు సిద్ధూ.

 

Latest Updates