కొమరం భీమ్ జిల్లాలోనూ.. బ్యాలెట్ ఓట్లకు చెదలు

Election counting stopped in Komaram Bhim District

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్ జరుగుతున్న క్రమంలో కొమరం భీమ్ జిల్లాలో గందరగోళ పరిస్థితి ఎదురైంది. జిల్లాకు చెందిన కౌటాల మండలం గురుడుపేట్, తలోడి గ్రామాల్లోని బ్యాలేట్ బాక్స్ లలో  బ్యాలేట్ పేపర్లకు చెదలు పట్టింది. అందులోని  50 ఓట్ల వరకు చెదలు పట్టినట్లు అధికారులు గుర్తించారు. బాక్సులో ఉన్న ఓట్లు చినిగిపోవడంతో కౌంటింగ్ సిబ్బంది అయోమయానికి గురయ్యారు. పై అధికారులకు సమాచారం అందించగా… వారి ఆదేశాలతో ఆ బాక్సు లెక్కింపును ఆపేశారు

Latest Updates