ర్యాండమైజేషన్‌ తో ఎన్నికల విధులు కేటాయింపు

Election duties conducting through randomization

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్లమెంట్‌ ఎన్నికలను సమర్థం గా నిర్వహించేందుకు,ఎన్నికల పోలింగ్‌‌ సిబ్బందిని రెండో ర్యాండమైజేషన్‌ ద్వారా నియోజకవర్గాల వారీగాఎన్నికల సిబ్బందిని కేటాయించినట్లు జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ లోకేష్‌ కుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌ లోని ఎన్‌ ఐ సీ కార్యాయలంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు అష్క్రిత్‌ తివారీ, హమీత్‌ కుమార్‌ సింగ్‌‌ల పర్యవేక్షణలో కలెక్టర్‌ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా లోకేష్‌ కుమార్‌ మాట్లాడుతూ 14 పోలింగ్‌‌ స్టేషన్లకు ఎన్‌ ఐసీలో ప్రత్యేక సాప్ట్‌‌వేర్‌ ద్వారా 26,396 మంది పోలింగ్‌‌ సిబ్బందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీ గా ర్యాండమైజేషన్‌ ద్వారా ఎన్నికల సిబ్బందిని కేటాయిం చామన్నారు. ప్రిసైడింగ్‌‌,అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌‌ అధికారులను, ఇతర పోలింగ్‌‌ సిబ్బందిని ఎంపిక చేశామన్నారు.ఈనెల 31న ప్రిసైడింగ్‌‌, అసిస్టెంట్‌ ప్రిసై-డింగ్‌‌ అధికారులకు కేటాయించి న నియోజకవర్గాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో పాల్గొనేవారు ఫారం-12, ఫారం–12ఏ సంబంధిత అధికారులకు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ హరీష్‌ , పరిశ్రమల శాఖాధికారి రాజేశ్వర్‌ రెడ్ డి, నోడల్‌ అధికారి విజయకుమారి, డీఐవో కిష్టప్ప, ఆడిషనల్‌ డీఐవోదీపిక, ఎన్‌ ఐసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బ్యా లెట్‍ ఓటు వినియోగించుకోవాలి

ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పోస్టల్‌ బ్యాలె ట్‌ తో ఓటు హక్కు ను విని-యోగిం చుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి లోకేష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.చేవెళ్ల లోక్‌‌సభ పరిధిలోని పీవో, ఏపీవో, ఓపీవోలుగా విధులు నిర్వర్తిం చే సిబ్బంది ఈఅవకాశాన్ని ఉపయోగిం చుకోవాలని తెలిపారు. పోస్టల్‌ బ్యాలె ట్‌ ఈడీసీ కోసం త్వరగాదరఖాస్తు చేసుకోవాలని సూచిం చారు. సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్ ఎన్నికల విధుల ధ్రువ-పత్రం పొందేం దుకు ఫాం -12, ఫాం 12ఏ ఎన్నికల ఉత్తర్వు ప్రతి, ఓటర్‌ నఖలు కాపీ,పాస్‌ ఫొటోను జతపరిచి స్థాని క ఏఆర్‌ వోలకు అందజేయాలని సూచిం చారు.

Latest Updates