ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపించాలి

దుబ్బాకలో శ్రీనివాస్ రెడ్డిని గెలిపించి.. ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపించాలన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గురువారం చెరుకు శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఉత్తమ్..దుబ్బాకలో పార్టీ గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త.. సైనికుల్లా పనిచేయాలన్నారు. దుబ్బాక తీర్పు నాలుగు కోట్ల ప్రజల మార్పన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. మల్లన్నసాగర్ ముంపు బాధితులను ప్రభుత్వం నిండా ముంచిందన్నారు. దుబ్బాక ప్రజలు చరిత్రను తిరగ రాయాలన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.  తనను గెలిపిస్తే దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేస్తానన్నారు కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీర్ల ఐలయ్య, తదితర కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.

Latest Updates