వయనాడ్‌లో రాహుల్‌కు వింత పోటీ

‘Election King’ K Padmarajan and Saritha Nair to fight Rahul from Wayanad
  •  రాహుల్‌కు పోటీగా నామినేషన్ వేసిన సేలం ‘ఎలక్షన్ కింగ్ ’
  • సోలార్ స్కాం ప్రధాన నిందితురాలు సరితా నాయర్ కూడా

వయనాడ్ లో రాహుల్​ గాంధీ పోటీ చేస్తున్నారు. అక్కడి నుంచి గెలుపు ధీమాతో ఉన్నారు.  కానీ,ఆయనకు అక్కడ ఓ వింత పోటీ ఎదురు కాబోతోంది. ఎక్కువ సార్లు ఎన్నికల్లో నిలిచి ఓడిపోయిన వ్యక్తి ఒకరు , సోలార్​ స్కాం లో ప్రధాన నిందితురాలు మరొకరు ఆయనపై పోటీకి దిగుతున్నారు. ‘ఎలక్షన్ కింగ్ ’గా  పేరు తెచ్చుకున్న తమిళనాడు సేలంకు చెందిన కే పద్మరాజన్ అనే వ్యక్తి వయనాడ్ నుంచి తన ‘201’వ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో ఎక్కువ సార్లు ఓడిపోయిన వ్యక్తిగా లిమ్కా బుక్​ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించి న ఆయన.. మరోసారి తన ‘రికార్డు అదృష్టాన్ని ’ పరీక్షించుకోబోతున్నారు.ఇక, ఇంతకుముందే వారం క్రితం తమిళనాడులోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ఆయన తన 200వ నామినేషన్ వేశారు. ఇప్పటికే తన పేరును గిన్నీస్ బుక్​లో చేర్చారని చెప్పిన ఆయన.. కొన్ని కొన్నిసార్లు రాజకీయ నేతలు బెదిరింపులకు దిగిన సందర్భాలున్నాయని చెప్పారు. 1991లో ఆంధ్రప్రదేశ్ లోని నంధ్యాల నియోజకవర్గం నుంచి నాటి ప్రధాని దివంగత పీవీ నరసింహరావుకు పోటీగా నామినేషన్ వేశానని, అయితే, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేశారని చెప్పారు. 1996లో ఐదు లోక్​సభ నియోజకవర్గాలు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు సహా 8 నామినేషన్లు వేశానని, అయితే, ఎన్నికల సంఘం మాత్రం రెండంటే రెండు నియోజకవర్గాలకు సంబంధించి న నామినేషన్లనే స్వీకరిం చిందని చెప్పారు. 30 ఏళ్లలో ఎన్నికల పేరు మీద రూ. 30 లక్షలు ఖర్చు చేసినట్టు చెప్పారు. ఆయన నామినేషన్లు వేసినా ప్రచారం మాత్రం చేయరు. 2011లో మెట్టూరు నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయనకు 6,273 ఓట్లు పోలయ్యాయి. అవే ఆయనకు వచ్చిన ఎక్కువ ఓట్లు.

సోలార్ స్కాంలో ప్రధాన నిందితురాలు

ఇక, రాహుల్​పై పోటీగా సోలార్​ స్కాం ప్రధాన నిందితురాలైన సరితా నాయర్​ కూడా స్వతంత్ర అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసింది.అంతేకాదు, తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపించిన కాంగ్రెస్ నేత హిబి ఈడెన్ పైనా ఎర్నాకులం నుంచి పోటీలో నిలిచింది. ఎంపీగా గెలవడానికో, లోక్​సభలో అడుగుపెట్టేందుకో తాను ఎన్నికల్లో పోటీ చేయడంలేదని, తనను వేధించి కేసులో ఇరికించిన వారికి బుద్ధి చెప్పాలనే బరిలోకి దిగుతున్నానని ఆమె చెప్పిం ది. మహిళల మీద అకృత్యాలకు పాల్పడిన ఇలాంటోళ్లు ఎన్నికల్లో ఎలా నిలబడతారని ఆమె ప్రశ్నించింది. అలాంటి నేతలకు టికెట్లు ఇవ్వొద్దని రాహుల్​ గాంధీకి లేఖలు కూడా రాశానని చెప్పింది. కానీ, స్పందన మాత్రం రాలేదని చెప్పింది. దేశానికి  ప్రధాని కావాలనుకుంటున్న వ్యక్తి మహిళల సమస్యలు పట్టించుకోకపోతే ఎలా అని ఆమె ప్రశ్నిం చింది.

Latest Updates