గాడిదలు, గుర్రాలపై EVMల తరలింపు : కొండల్లో పోల్ సీన్

తమిళనాడు : కొడైకెనాల్ లో పోలింగ్ అధికారులు ఏర్పాట్ల కోసం కష్టాలు పడుతున్నారు. కష్టపడి గుట్టలు.. చెట్లు.. కాలువలు దాటి… కొండ ప్రాంతాలపైకి ట్రెక్కింగ్ చేసి… అక్కడున్న రిమోట్ గ్రామాల్లో పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ సామాగ్రి మోసుకుపోవడం సాధ్యం కాకపోవడంతో.. గాడిదలు, గుర్రాలను ఉపయోగిస్తున్నారు. ఈవీఎం మెషీన్లు, ఎలక్షన్ సామాన్లను బ్యాగుల్లో సర్ది గాడిదల సహాయంతో.. వాటిని కొండ గ్రామాలకు చేర్చారు. కనీసం నడవడానికి కూడా దారి లేని ఈ ప్రాంతాల్లో… అధికారుల రోజంతా కష్టపడి గమ్యస్థానాలకు చేరుకున్నారు.

ఎన్నికలు జరిగినప్పుడే అధికారులు, నాయకులు తమవైపు చూస్తారని స్థానికులు అన్నారు. తమ ఊళ్లకు ముందే రోడ్లు వేసి ఉంటే అధికారులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని గ్రామస్తులు చెప్పారు.

Latest Updates