బ్రేక్ ఫాస్ట్ కోసం పోలింగ్ నిలిపివేత…

నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలో ఎలక్షన్ సిబ్బంది టిఫిన్ చేసేందుకు…పోలింగ్ ను నిలిపివేయడం చర్చనీయాంశమైంది. కాల్వ గ్రామంలోని రెండో నంబర్ పోలింగ్ కేంద్రానికి ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. అయితే తాము టిఫిన్ చేయాల్సి ఉందని…ఎన్నికల సిబ్బంది పోలింగ్ ఆపి గందరగోళం సృష్టించారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. టిఫిన్ చేసేవరకు ఆగాల్సిందేనని దురుసుగా ప్రవర్తించడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వారు వినకపోవడంతో చేసిది లేక లైన్లలో వేచిచూశారు.

Latest Updates