మెదక్ లోక్ సభ సెగ్మెంట్ లో ఎలక్షన్ సీన్

రాష్ట్రం లోని లోక్ సభ స్థానాలన్నింటిలో మెదక్‌ నియోజకవర్గానికి వీఐపీ బ్రాండ్ ఉంది. గతంలోమాజీ ప్రధాని ఇందిరాగాంధీని గెలిపించిన ఈ నియోజకవర్గ ఓటర్లు.. ఉద్యమ సమయంలో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అధినేత కేసీఆర్ కు రికార్డు విజయం కట్టబెట్టారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ ఇక్కడ భారీ మెజారిటీతో విజయం సాధించారు. దాం తోపాటు గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ గెలిచారు. దీంతో కేసీఆర్ ఎంపీ సీటుకు రాజీనామాచేయగా, ఉపఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో టీఆర్ ఎస్ తరఫున బరిలోకి దిగిన కొత్త ప్ర భాక ర్ రెడ్డి కూడా భారీ మెజారిటీ వచ్చింది. ఈసారీ టీఆర్ ఎస్ నుంచి ఆయనే బరిలో ఉన్నా రు. కాంగ్రెస్, బీజేపీల నుంచి మాత్రం కొత్త అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థిగా గాలి అనిల్‌‌‌‌ కుమార్‌ , బీజేపీ నుం చి రఘునందన్‌‌‌‌రావు పోటీ చేస్తున్నారు. సంస్థాగతంగా పార్టీల బలాబలాలు,మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. రికార్డు మెజారిటీ టార్గెట్ టీఆర్​ఎస్ కంచుకోటగా పేరున్న ఈ నియోజక వర్గంలో సిట్టిం గ్ ఎంపీ ప్రభాకర్​రెడ్డినే తిరిగి బరిలోకి దింపింది. 2014 జనరల్‌‌‌‌ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన కేసీఆర్‌ 3.97 లక్షల ఓట్ల మెజారిటీతో రికార్డు విజయం సాధించా రు. కేసీఆర్​ సీఎం కావడం, ఎంపీ సీటుకు రాజీనామా చేయటంతో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రభాకర్​రెడ్డికి 3.61 లక్షల మెజారిటీ వచ్చింది. ఇటీవలి ఎన్నికల్లోనూ టీఆర్​ఎస్ హవా కనిపించింది. లోక్​సభ సెగ్మెంట్​ పరిధిలోని మెదక్​ మినహా సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్‌‌చెరు, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేటల్లో టీఆర్​ఎస్ ఎమ్మెల్యే లే ఉన్నారు. ఇందులో కేసీఆర్, హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్,సిద్దిపేట నియోజకవర్గాలు టీఆర్​ఎస్ కు కంచుకోటలు. ఈ నేపథ్యంలో మెదక్​ లోక్​సభ స్థానంలో భారీ మెజారిటీ సాధించా లని టీఆర్​ఎస్ టార్గెట్​గా పెట్టుకుంది. స్వయంగా  సీఎం కేసీఆర్​ ఇక్కడ పార్టీ ఎన్నికల ఇన్‌‌చార్జీగా ఉన్నారు. ప్రచార బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించా రు. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, పలువురు నేతలు తాజాగా టీఆర్​ఎస్ లో చేరారు. దీంతో గులాబీ దళం బలంగా కనిపిస్తోంది.

పాత వైభవం, బీసీ కార్డే ప్రచారం….

టీఆర్​ఎస్ ఆవిర్భావాని కి ముందు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో మళ్లీ పట్టుసాధించాలని ఆరాటపడుతోంది. ఈసారి కొత్త అభ్యర్థిని పోటీకి దింపింది. అసెంబ్లీ ఎన్నికలకు ముం దు టీఆర్​ఎస్ నుం చి కాం గ్రెస్ లో కి వచ్చిన గాలి అనిల్ కుమార్​కు టికెట్​ ఇచ్చిం ది. ఆయన ఎంపీ సీటుకు పోటీ పడటం ఇదే తొలిసారి. కాంగ్రెస్ స్టార్‌ క్యాం పెయినర్‌ విజయశాంతి ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే మెదక్​ మినహా మిగతా అసెంబ్లీ స్థానాల్లో పార్టీ గెలవలేకపోవడం, ఉన్న ముఖ్య నేతల్లో కొందరు టీఆర్​ఎస్ లో చేరిపోవడం కాం గ్రెస్ కు ఇబ్బందికరంగా మారుతున్నా యి. కానీ ఇటీవలి ఎమ్మెల్ సీ ఎన్నికల ఫలితాలు టీఆర్​ఎస్ పై వ్యతిరేకతకు నిదర్శనమని,ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓట్లు, బీసీ ఓటు బ్యాం కు తమకు కలిసొస్తాయని కాం గ్రెస్ భావిస్తోంది.

మోడీ పాపులారిటీపై ధీమా….

బీజేపీ తమ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావును ఇక్కడ పోటీకి దిం పింది. తొలిసా రిగా ఆయన ఎంపీ సీటుకు పోటీలో నిలిచా రు. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన బీజేపీ అభ్యర్ థి చాగళ్ల నరేంద్ర నాథ్ మూడో స్థానంలో ఉన్నా రు. అప్పటితో పోలిస్తే బీజేపీ పుంజుకుందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నా యి. ప్రధాని మోడీ చరిష్మాతో పాటు ఇటీవల జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న పరిణామాలతో బీజేపీ ఆదరణ పెరిగిందని, అది తమకు కలిసొస్తుందని ఆశిస్తోంది.

Latest Updates