ఓటుకు కమ్మలు : బంగారం పేరుతో గిల్ట్ నగలిచ్చారు

చిత్తూరు : పలమనేరు నియోజకవర్గంలో గిల్ట్ కమ్మల పంపిణీ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల వేళ డబ్బులు, నగలు, మద్యం పంపిణీ చేసి ప్రలోభ పెట్టి ఓటర్లను ఆకట్టుకోవడం సాధారణంగా జరుగుతున్నదే. ఐతే… ఓ పార్టీ నేతలు…ఇచ్చిన కానుకలపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.

ఓటుకు కమ్మలంటూ ఓ అభ్యర్థి తన అనుచరులతో ఓటర్లకు కానుకలు పంపిణీ చేయించారు. బంగారు కమ్మలు అంటూ పెద్ద ఎత్తున పంపిణీ చేశారు ఆ పార్టీ నేతలు. కానుకలు తీసుకున్న ఓటర్లు తెలివిగా బంగారు దుకాణంలో వాటిని చెక్ చేయించారు. అవి బంగారం కమ్మలు కాదు… గిల్ట్ నగలని తేలింది. అసలు విషయం తెలుసుకున్న ఓటర్లు.. నాయకుల తీరుపై విసుక్కున్నారు. మోసం చేయడం కరెక్ట్ కాదన్నారు.

 

Latest Updates