రారండోయ్ ఎన్నికలు చూద్దాం..

Election tourism in India
  • జోరుగా ఎలక్షన్​ టూరిజం..విదేశీయుల రాక
  • ఇండియాలో ఎన్నికలని చూసేందుకు విదేశీయుల ఆసక్తి.

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల వేళ ‘ఎలక్షన్ టూరిజం’ జోరందుకుంది. దునియాలోనే అతి పెద్ద డెమోక్రటిక్ ఈవెంట్ ను కళ్లా రా చూడరమ్మంటూ విదేశీయులకు ఆహ్వానం పలుకుతున్నాయి పలు ట్రావెల్ఏజెన్సీలు. 90 కోట్ల మంది ఓటర్లు పాల్గొ నే ఎన్నికలప్రక్రియ ఏ విధంగా సాగుతుం దో తెలుసుకునేం దు-కు ఫారినర్లు కూడా ఆసక్తిచూపుతున్నారు . ఇప్పటికేఇండియాలో అడుగుపెట్టిన కొన్ని బృందాలు, పలురాష్ట్రాల్లో పర్యటిస్తూ ఎన్నికల మజాను ఆస్వాదిస్తున్నాయి. వచ్చే రెండు నెలలూ ఎన్నికల సీజనే కావడంతో టూరిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశంఉంది.సభలో పాల్గొని అభ్యర్థితో మాట్లా డొచ్చు ఎలక్షన్ టూరిజంలో భాగంగా ట్రావెల్ ఏజెన్సీలు తీరొక్క ప్యా కేజీని రూపొందిం చాయి. ఎన్నికలు ఏయేప్రాంతాల్లో ఏం జరగబోయేది ముందుగా షెడ్యూల్ ను ప్రిపేర్ చేస్తారు . టూరిస్టుల ఆసక్తిని బట్టి ఎంచుకున్న ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియను చూపిస్తారు. పార్టీల సభలకు తీసుకెళ్లడం. వీలైతే ఎంపీ అభ్యర్థులతో మాట్లాడించడం, గ్రామీణ ఓటర్లతో ముఖాముఖీ,అర్బన్ ఓటర్లతో కలిసి ర్యాలీలు, అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ తదితర కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు . మినిమమ్ మూడు రోజులు, మ్యా గ్జిమమ్ రెండు వారాలపాటు జరిపే పర్యటనలకు ప్యాకేజీని బట్టి రూ.40 వేల నుంచి రూ.2లక్షల దాకా చార్జ్ వసూలు చేస్తున్నారు .గుజరాత్‌ లో మొదలై..2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎలక్షన్ టూరిజం పేరుతో ట్రావెల్ ఏజెన్సీలు విదేశీయుల కోసం ప్రత్యేక ప్యా కేజీలు ప్రకటించాయి. 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి ఎలక్షన్ టూరిజం కాన్సెప్ట్ ను ఇతర రాష్ట్రా లు కూడా ఫాలో అయ్యాయి. 2018 కర్ణా టక అసెంబ్లీ ఎన్నికలప్పుడూ ఎలక్షన్ టూరిజం బాగానే సాగిం ది. అయితే ఎన్నికల వేళ విదేశీ టూరిస్టులని ఆకట్టుకోవడంలో ఇప్పటికీ గుజరాత్ దే పైచేయి. ఈ ఎన్నికల సీజన్ లో గుజరాత్ లో పర్యటిం -చే ఫారినర్ల సంఖ్య మూడు వేలు దాటే అవకాశంఉందని గుజరాత్ టూరిజం డెవలప్ మెంట్ సొసైటీ-(జీటీడీఎస్ ) చైర్మన్ మనీశ్ శర్మ చెప్పారు. గుజరాత్తర్వాత విదేశీయుల్ని ఎక్కు వగా ఆకర్షించే రాష్ట్రం ​ఉత్తరప్రదేశ్ .

ఎన్నికల కుంభమేళాకు రండి

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలివి. దాదా పు90 కోట్ల మంది ఓటర్లు పాల్గొ నే ఈ ప్రక్రియద్వారా ఇండియాలో ప్రజాస్వామ్యం ఎలాపనిచేస్తు న్నదో తెల్సుకోవచ్చు. ఒకమారుమూల గ్రామానికి చెందిన ఓటరు,కేంద్రంలో ఎవరుం డాలో డిసైడ్ చేసే తీరునుకళ్లారా చూడటం ని జంగా అరుదైనఅవకాశం. ప్రజాస్వామ్యా న్ని నమ్మేవాళ్లు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.ఇండియా ఎన్నికల కుంభమేళాకు రావాల్సిం దిగా ప్రపంచ దేశాల ప్రజలకు ఆహ్వానం పలుకుతున్నా.– ఎలక్షన్​ టూరిజం ప్రచార వీడియోలోపీఎం మోడీ సందేశం

Latest Updates