1,47,429 మందికి శిక్షణ

election training to Officers

లోక్ సభ ఎన్ని కల నిర్వహణ, పోలింగ్ అంశాలపై సిబ్బందికి పూర్తి స్థా యి శిక్షణ ఇచ్చారు. పోలింగ్ డే సిబ్బంది సహా మొత్తం 1,47,429 మందికి ప్రత్యేకంగా ట్రైనిం గ్ ఇచ్చారు. అందులో ఈవీఎం హ్యాండ్లిం గ్ పై మరికొందరికి స్పెషల్ ట్రైనిం గ్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సిబ్బందికి శిక్షణా తరగతులను నిర్వహించారు. కొన్ని చోట్ల ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల పోలింగ్ ఆలస్యం గా ప్రారంభమైన ఘటనలున్నాయి. అయితే, వాటి వాడుకపై సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇబ్బందులొచ్చాయి తప్ప, ఈవీఎంలలో ఎలాంటి లోపాలు లేవన్న అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. అంతేకాదు, పోలింగ్ స్టేషన్ల వద్ద ఈవీఎంలను సరఫరా చేసే ఈసీఐఎల్ , బీఈఎల్ ఇంజనీర్లు ఉన్నా వారి సేవలను వినియోగించుకోలేదని సీఈవో గుర్తిం చారు. ఈ నేపథ్యం లోనే వారికి పూర్తి స్థా యి శిక్షణ ఇచ్చారు. పోలింగ్ కేం ద్రాల వద్ద పరిస్థి తులను ఎప్పటి కప్పుడు ఉన్నతాధికారులకు చెప్పేలా పోలీస్ అధికారులకూ శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా 3,649 మంది కౌంటింగ్ సిబ్బందికి తరగతులు నిర్వహించారు. అవసరమైతే ఎన్నికలయ్యాక మరోసారీ వారికి శిక్షణ ఇచ్చే అవకాశాలను సీఈవో రజత్ కుమార్ పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం ఎక్కువగా ఉండడంతో వాటిపై అధికారు-లు దృష్టి పెట్టారు. అందుకోసం 441 మంది శిక్షణ పొందారు. బుధవారం సీఈవో కార్యాలయంలో ఐటీ అధికారిని నియమించారు. 24 గంటల పాటు టీవీలు, వాట్సాప్ , ఫేస్ బుక్ , ట్వి ట్టర్ , ఇన్ స్టాగ్రామ్ ,యూట్యూబ్ లను పర్యవేక్షించేం దుకూ ప్రత్యేక సెల్ ను పెట్టారు. కాగా, ఎన్ని కల్లో డబ్బు , మద్యం ప్రవాహాన్ని నిరోధించేం దుకు అన్ని చర్యలు తీసుకున్నామని జాయిం ట్ సీఈవో రవికిరణ్ తెలిపా రు. పార్టీలు, అభ్యర్థు లు ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. రాష్ట్రమంతా వివిధ విభాగాల వి జిలెన్స్​ టీమ్ లు పనిచేస్తున్నాయని, పౌరులూ తమ దృష్టికి వచ్చిన ఉల్లం ఘనలను సీ విజిల్ యాప్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.

Latest Updates