ఒక్క సీటుకు 60వేల మంది పోలీసులు

దండకారణ్యం లో మావోయిస్టులకు కీలక స్థావరమైన బస్తర్ లో లోక్ సభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. బహిష్కరణకు మావోయిస్టులు పిలపునిచ్చిన నేపథ్యం లో ఒక్క బస్తర్ ఎంపీ స్థానంలో రాష్ట్ర సాయుధ పోలీసులు,కేంద్ర పారామిలటరీ బలగాలను కలుపుకొని మొత్తం 60 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఛత్తీస్ గఢ్ లో ఉన్నవి 11 లోక్ సభ స్థానాలే అయినా, నక్సల్స్ ప్రభావం దృష్ట్యా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి విడతగా ఏప్రిల్ 11న బస్తర్లో పోలింగ్ జరగనుంది. దంతేవాడ, కొం డగాన్, బీజాపూర్, నారాయణ పూర్ జిల్లాలు ఈ సీటు పరిధిలోకే వస్తాయి. వ్యూహాత్మకంగా గ్రామాలకు ఐదారు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కనే పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కు మూడు రోజుల ముందే ఎన్ని కల సిబ్బందిని పోలింగ్ స్టేషన్లకు తరలించనున్నారు. అవసరమైతే హెలిక్యాప్టర్లను కూడా వాడుతామని ఈసీ తెలిపింది. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో 650 కంపెనీలకు చెందిన 77 వేల పారామిలటరీ బలగాలను ఛత్తీస్ గఢ్ లో మోహరించారు. ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతుండడంతో ప్రస్తుతం అక్కడ 80 కంపెనీల బలగాలను మాత్రమే తరించారు. పుల్వామా దాడిని దృష్టిలో పెట్టుకొని భద్రతా బలగాల కాన్వాయ్ ను తరలించేటప్పుడు డ్రోన్ కెమెరాలు వాడుతున్నట్లు దంతేవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు. ఇటీవలే దంతేవాడలో నక్సల్స్ దాడుల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాను మరణించడంతో పాటు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారం కిందట బీజాపూర్లో ఓ ప్రయివేట్ వాహనాన్ని ఐఈడీతో పేల్చడంతో తొమ్మిది మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు.

బీజేపీ కోట.. కాంగ్రెస్​ సత్తా….

రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన బస్తర్ లో బీజేపీ దే హవా.1998 నుంచి బీజేపీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు.అయితే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బస్తర్ లోక్ సభ పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో దంతెవాడ మినహా ఏడు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది.

Latest Updates