ఎన్నికలకు సిద్ధమైన హైదరాబాద్  క్రికెట్  అసోసియేషన్

హైదరాబాద్  క్రికెట్  అసోసియేషన్  ఎన్నికలకి  రంగం సిద్ధమైంది. ఈ నెల 27న HCA ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ తెలిపారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరరీ, ఆఫీస్ బేరర్లు, కౌన్సిలర్ పదవికి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 17 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 23న ఉప సంహరణకు చివరి తేదీ అన్నారు. ఎన్నికలు జరిగే రోజే ఫలితాలు విడుదల చేస్తామన్నారు. లోథా కమిటీ రూల్స్ ప్రకారం 11 మంది మాజీ ఇంటర్నేషనల్ ప్లేయర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీంతో పాటు 155 ప్రైవేట్ క్లబ్ లు, 51 ఇనిస్టిట్యూషనల్ క్లబ్ లు, 9 జిల్లాలకు చెందిన క్లబ్ లు ఓటు హక్కు వినియోగించుకోనున్నాయి.

Latest Updates