లోక్ సభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే: సునీల్ ఆరోరా

షెడ్యూల్ ప్రకారమే లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC)  సునీల్ ఆరోరా. లక్నోలో మాట్లాడిన ఆయన … భారత్-పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతల ఎఫెక్ట్ లోక్ సభ ఎన్నికల నిర్వహణపై ఉండబోదన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఇకపై అభ్యర్థులు భారత్ లోని ఆస్తుల గురించే కాకుండా విదేశాల్లోని వారి ఆస్తుల వివరాలను కూడా సమర్పించాల్సి ఉంటుందన్నారు. వాటిని ఆదాయపన్ను శాఖ పరిశీలిస్తుందని, ఏవైనా తేడా కనిపిస్తే ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో వాటిని అప్ లోడ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సంఘం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు కట్టుబడి ఉందన్న సునీల్ అరోరా… ఏవైనా సమస్యలుంటే ఫిర్యాదు చేయాలన్నారు. వాటిపై వెంటనే చర్యలు చేపడతామన్నారు.

 

Latest Updates