ఈ బైక్స్ దే ఫ్యూచర్..!

ఒకప్పుడు ఎక్కడికెళ్లాలన్నా నడిచో,  సైకిల్ మీదో వెళ్లే వాళ్లు. కానీ ఇప్పుడంత ఓపికలేదు. వీధి చివరకు వెళ్లాలన్న కారో, బైకో కావాల్సిందే.  అసలే రోజురోజుకీ  భూమి మీద ఇంధన వనరులు కరిగిపోతున్నాయంట. దీనికి తోడు వెహికిల్స్ వల్ల ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్.
అసలు ఈ మోటార్ వాహనాల  వల్ల జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. మరి దీనికి సొల్యూషన్ ఏది?

ఈ మధ్య అన్ని వస్తువుల్లో ‘ఎకో ఫ్రెండ్లీ’ అనే ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు అదే ట్రెండ్ ఆటోమొబైల్ రంగంలోకి కూడా వచ్చింది. ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ లాగానే ఎకో ఫ్రెండ్లీ బైక్స్ కూడా వస్తున్నాయి. అంటే పెట్రోల్ లేకుండా బ్యాటరీతో నడిచే బైకులన్న మాట. ఇవి ఇదివరకే ఉన్నా ఇప్పుడు వీటి ట్రెండ్ ఇంకా  స్పీడందుకుంది. పెద్ద కంపెనీల నుంచి చిన్న స్టార్టప్‌‌ల వరకూ అన్నీ ఈ–వెహికిల్స్‌‌పైనే ఇంటరెస్ట్ చూపుతున్నాయి. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌‌దే అంటున్నాయి.

రివోల్ట్ ఆర్వీ 400

రీసెంట్‌‌గా దేశంలో ఆటోమొబైల్ అమ్మకాలు తగ్గిపోతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే  టైంలో మార్కెట్‌‌లోకి అడుగుపెట్టింది  ‘రివోల్ట్’. అదిరిపోయే డిజైన్, సూపర్ ఫీచర్లతో ఆర్‌‌వీ400, ఆర్‌‌వీ 300 అనే రెండు మోడల్స్‌‌ను రిలీజ్ చేసింది. ఈ బైక్స్‌‌ను డైరెక్ట్‌‌గా డబ్బు చెల్లించి కొనలేం. కేవలం ఇన్‌‌స్టాల్ మెంట్స్ రూపంలో మాత్రమే వీటిని కొనే వీలుంది. రివోల్ట్ ఆర్‌‌వీ 300 బైక్‌‌కు నెలకు రూ.2,999,  ఆర్‌‌వీ 400 ప్రీమియం బైక్‌‌కు నెలకు రూ.3,999 చొప్పున 37 నెలల్లో డబ్బు చెల్లించాలి.

ఆర్‌‌వీ 400, ఆర్‌‌వీ300 బైక్స్ చూడడానికి ప్రీమియం బైక్స్‌‌ లా ఉంటాయి. నేక్‌‌డ్ స్ట్రీట్ ఫైటర్ లుక్‌‌తో బైక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఆర్‌‌వీ 400 బైక్‌‌లో 3.24 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 156 కిలోమీటర్లు వెళ్లొచ్చు. బైక్ టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు.  ఇక రివోల్ట్ ఆర్‌‌వీ300 బైక్‌‌లో 2.7 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. ఒక్కసారి చార్జింగ్ పెడితే 80 నుంచి 150 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. అలాగే ఈ బైక్ లో  ఆర్టిఫిషియల్ ఎగ్జాస్ట్  సౌండ్, లొకేషన్, మ్యాప్ గైడ్, దగ్గరిలోని బ్యాటరీ స్వాప్ స్టేషన్, బ్యాటరీ పేమెంట్స్, బైక్ డయాగ్నస్టిక్స్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ బైక్‌‌ను ‘మై రివోల్ట్’ యాప్ ద్వారా మొబైల్‌‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. రిమోట్ కంట్రోల్,  వాయిస్ కంట్రోల్ ద్వారా కూడా బైక్  స్టార్ట్ చేయొచ్చు. రివోల్ట్ కంపెనీ  బైక్స్‌‌కు 8 ఏళ్లు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తోంది. ప్రతి 10,000 కిలోమీటర్లకు ఒకసారి బైక్ సర్వీస్ చేయించాలి. మూడేళ్ల పాటు ఫ్రీ సర్వీస్ ఉంటుంది.

ప్యూర్‌‌ ఎనర్జీ ‘ఎప్లూటో’

ప్యూర్ ఎనర్జీ కంపెనీని ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు స్టార్ట్ చేశారు. ఈ కంపెనీకి ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీలో మంచి పేరుంది.  ప్యూర్ ఎనర్జీ నుంచి రిలీజ్ అయిన ఎప్లూటో బైక్ తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందిస్తోంది. ఎప్లూటో ఎలక్ట్రిక్‌‌ బైక్‌‌  స్టైలిష్‌‌ డిజైనింగ్‌‌తో చూడడానికి సింపుల్‌‌గా సైకిల్‌‌లా కనిపిస్తుంది. ఇందులో ఉండే పోర్టబుల్‌‌ బ్యాటరీని  ఇంట్లో లేదా ఆఫీస్‌‌లో ఎక్కడైనా చార్జింగ్ పెట్టుకోవచ్చు. 16 యాంప్ సాకెట్‌‌లో కూడా ఈ బ్యాటరీ చార్జ్ అవుతుంది.  ఒకసారి  ఫుల్‌‌ చార్జ్‌‌ చేస్తే  వంద కిలోమీటర్లు వెళ్లొచ్చు. హైస్పీడ్‌‌ 60 కిలోమీటర్లు. ధర
రూ. 75వేలు.

ఎథర్‌‌ 450

ఎథర్ 450 ఈ– బైక్ ను ‘ఎథర్ ఎనర్జీ’ కంపెనీ రూపొందించింది. ఎథర్‌‌ 340, ఎథర్‌‌ 450 అని రెండు మోడల్స్‌‌ను రిలీజ్ చేసింది. ఇవి చూడడానికి స్కూటీలా ఉంటాయి. ఎథర్ 450  గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 2.4 కిలోవాట్ల లిథియమ్‌‌ బ్యాటరీ ఉంటుంది. నాలుగు గంటల్లో బ్యాటరీ ఫుల్ అవుతుంది. సింగిల్  చార్జ్‌‌లో 55 నుంచి 75 కిలో మీటర్లు ప్రయాణించొచ్చు. ఈ బైక్  స్పీడో మీటర్ ప్లేస్‌‌లో  టచ్‌‌స్క్రీన్‌‌ ఉంటుంది. జీపియస్, బ్యాటరీ లెవల్ లాంటి వివరాలు అక్కడ చూసుకోవచ్చు. దీని ధర రూ.1.23లక్షలు

ట్రోనెక్స్ ‘వన్’

ట్రోనెక్స్ వన్ సింపుల్ ఎలక్ట్రికల్ బైక్. సైకిల్ లా ఉండే ఈ బైక్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది.  బ్యాటరీ ఒక్క సారి ఛార్జ్ చేస్తే 70 నుంచి 85 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. లాక్, అన్‌‌లాక్ ఆప్షన్, నావిగేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లతోపాటు స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారా ఫిట్‌‌నెస్ గోల్స్ సెట్ చేసుకునే అవకాశం  కూడా ఈ బైక్ కల్పిస్తుంది. ఈ బైక్ మినిమల్ స్పీడ్‌‌తో వెళ్తుంది కాబట్టి దీన్ని డ్రైవ్ చేయడానికి లైసెన్స్ కూడా అక్కర్లేదు.
ఈ ఎలక్ట్రిక్ బైక్‌‌లో రెండు రకాల రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ మోటార్‌‌‌‌తో వెళ్ళొచ్చు లేదా  సైకిల్‌‌లా తొక్కుకుంటూ వెళ్లొచ్చు. ఈ-బైక్ ధర రూ. 49,000.

హీరో ఎలక్ట్రిక్

మనదేశంలో పెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ల కంపెనీ ‘హీరో ఎలక్ట్రిక్స్’. ఈ కంపెనీ హై స్పీడ్  ఈ–బైక్స్‌‌ను తయారు చేస్తుంది. ప్రస్తుతం హీరో హై స్పీడ్  సిరీస్‌‌లో నిక్స్, ఫోటాన్, ఆప్టిమా అనే మూడు మోడల్స్ ఉన్నాయి. ఈ మూడు బైక్స్ ఎలక్ట్రిక్  బైక్స్ మార్కెట్‌‌లో మంచి సక్సెస్​సాధించాయి. ఇప్పుడు హీరో ఎలక్ట్రిక్ కొత్తగా ‘యాగ్జిల్’ పేరుతో మరో హై స్పీడ్ బైక్‌‌ను తీసుకురాబోతుంది.
ఈ బైక్ గంటకు 85కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌‌తో 110 కిలోమీటర్ల వరకూ నడుస్తుంది. బ్లూటూత్ ద్వారా మొబైల్ కనెక్టివిటీ ఫీచర్ ఉంది. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఇనుస్ట్రుమెంట్ కన్సోల్ స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్‌‌ను సపోర్ట్ చేస్తుంది. త్వరలోనే ఈ బైక్ మార్కెట్​లోకి రాబోతుంది.

టీ6 ఎక్స్‌‌

టార్క్‌‌ మోటార్‌‌ సైకిల్స్‌‌ నుంచి త్వరలో రాబోతున్న ఎలక్ట్రిక్‌‌ బైక్‌‌  ‘టీ6ఎక్స్‌‌’. ఇందులో ఎన్నో అడ్వాన్స్‌‌ ఫీచర్లు ఉన్నాయి.
జీపీఎస్‌‌, నేవిగేషన్‌‌ ఫీచర్లతో పాటు క్లౌడ్‌‌ కనెక్టివిటీ కూడా ఉంది.  ఒకసారి చార్జ్‌‌ చేస్తే వంద కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. మంచి బ్యాకప్  కెపాసిటీ ఉన్న బ్యాటరీతో పాటు పవర్‌‌‌‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటర్ కూడా దీని సొంతం. గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ బైక్ స్పెషాలిటీ.. దీని ధర  రూ. 1.25 లక్షలు.

 

Latest Updates