‘పవర్​’ఫుల్​ ఈల్

ఎలక్ట్రోఫోరస్​ వోల్టాయి.. దీని పవర్​ 850 వోల్టులు

వందల వోల్టుల కరెంట్​ ఒంటికి తగిలితే ఎట్టా ఉంటది! రక్తమంతా ఆవిరైపోతది! ఇదిగో ఈ ఎలక్ట్రిక్​ ఈల్​ అంత పవర్​ఫుల్​. దీని ‘పవర్​’తో ఏ ఎలక్ట్రిక్​ ఈల్​ సాటి రాదు. అమెజాన్​ బేసిన్​లో ఎక్కువగా ఉండే ఈ ఈల్​ ఒంటి నిండా 860 వోల్టుల కరెంట్​ను నింపుకుంటుందట. మామూలుగా అయితే, ఓ ఎలక్ట్రిక్​ ఈల్​ పవర్​ 650 వోల్టులుంటుందని సైంటిస్టులు అంటున్నారు. స్మిత్సోనియన్​కు చెందిన నేషనల్​ మ్యూజియం ఆఫ్​ నేచురల్​ హిస్టరీ సైంటిస్టులు ఇంత పవర్​ ఉన్న రెండు​ఎలక్ట్రిక్​ ఈల్స్​ జాతులను గుర్తించారు. అందులో ఒక దాని పేరు ఎలక్ట్రోఫోరస్​ వోల్టాయి. మామూలు ఎలక్ట్రిక్​ ఈల్స్​ అయిన ఎలక్ట్రోఫోరస్​ ఎలక్ట్రికస్​తో పోలిస్తే వీటి శక్తి చాలా చాలా ఎక్కువ. నిజానికి ఇవి మామూలు చేపల్లాంటివే. కాకపోతే వాటి ఆకారం ఈల్స్​ను పోలి ఉండడంతో అలా పిలుస్తుంటారు.

ఒక్కోటి 8 అడుగుల వరకు పెరుగుతుంది. ఎక్కువగా అమెజాన్​ వర్షారణ్యాల్లోనే కనిపిస్తుంది. 250 ఏళ్లలో ఇంత పవర్​ఫుల్​ ఈల్​ను గుర్తించడమంటే, అమెజాన్​ బేసిన్​లో ఇలాంటివి మరిన్ని ఉండి ఉంటాయన్న దానికి నిదర్శనమని లీడ్​ సైంటిస్ట్​ డేవిడ్​ డి సాంటానా చెప్పారు. కొత్తగా కనుగొన్న రెండు ఈల్స్​ జాతులతో కలిపి ఇప్పుడు మూడయ్యాయి. అయితే, ఆ మూడు రకాల ఈల్స్​ జన్యువుల్లో తేడాలున్నట్టు గుర్తించారు సైంటిస్టులు. వాటి తలలు, ఆకారం, వాటి పవర్​ అన్నింట్లోనూ తేడాలున్నట్టు తేల్చారు. ఈ మూడు జాతులు కూడా 71 లక్షల ఏళ్ల క్రితం ఓ ఎలక్ట్రిక్​ఈల్స్​ జాతి నుంచే పుట్టాయని భావిస్తున్నారు. అయితే, తేట నీళ్లలో కరెంట్​ ప్రసరించదు కాబట్టి, దానికి తగ్గట్టు అవి పవర్​తో ఉంటున్నాయని అనుకుంటున్నారు.

ఒక బ్యాటరీని కనిపెట్టడానికి ఈ ఈల్స్​నే సైంటిస్టులు స్ఫూర్తిగా తీసుకున్నారంటే నమ్ముతారా? 1799లో సైంటిస్టులు వీటి ఆధారంగానే బ్యాటరీలను రూపొందించారంటున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వాటిలోని పవర్​ ఆధారంగా జబ్బులకు చికిత్స చేయడంలోనూ కొత్త పద్ధతులను కనుక్కోవచ్చని భావిస్తున్నారు. ఈల్స్​లో రకరకాల ఎంజైములు, రకరకాల కాంపౌండ్లు ఉంటాయని, వాటితో మందులు తయారు చేయొచ్చని, అవసరమైతే కొత్త టెక్నాలజీలనూ తయారు చేయొచ్చని వేడివ్​ డి సాంటానా అన్నారు.

Latest Updates