గుప్త నిధుల తవ్వకాలకు వెళ్ళిన వ్యక్తికి కరెంట్ షాక్.. తీవ్ర గాయాలు

చిత్తూరు: గుప్త నిధుల తవ్వకాలకు వెళ్ళిన ముఠా సభ్యునికి కరెంట్ షాక్ తగిలిన ఘటన జిల్లాలోని  పలమనేరు, దొడ్డిపట్ల అటవీ బీట్ లో జరిగింది. మొత్తం ఆరుగురు వ్యక్తుల ముఠా నిధుల తవ్వకానికి వెళుతుండగా..  పంట పొలాల్లో అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన కరెంటు తీగలతో ముఠా లోని గణేష్ అనే వ్యక్తికి కరెంట్  షాక్ తగిలింది.

అయితే ఈ సంగతి ఆ గ్రామ వీఆర్వో కి తెలియడంతో నిధుల తవ్వకంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిధుల తవ్వకం, కరెంట్ షాక్ తగిలి వ్యక్తి గాయాలైన ఘటనల గురించి విచారణ జరిపి.. విద్యుద్ఘాతం వల్ల గాయాలపాలైన గణేష్ కు తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విచారణలో తన పై యాసిడ్ దాడి జరిగింది అంటూ గణేష్ తప్పుడు స్టేట్మెంట్ ఇస్తుండగా..  పోలీసులు మాత్రం గణేష్ గుప్త నిధుల ముఠా సభ్యుడే అంటూ పక్కగా చెబుతున్నారు. సాక్ష్యాధారాలు తారు మారు చేసేందుకు ముఠా సభ్యులు ఈ ఘటనను రహస్యంగా ఉంచారని తెలిపారు.

Latest Updates