కరెంట్ బిల్ @2లక్షలు..

నర్సింహులపేట (మరిపెడ), వెలుగు: కరెంట్ వాడుకోకుండానే గృహావసరాలకు ఎడాపెడా వచ్చిన బిల్లును చూసి ఓ కస్టమర్ షాక్ అయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండల కేంద్రంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన వస్రంకు మూడు నెలల ఇంటి కరెంట్ బిల్లు రూ.2 లక్షల 16 వేలు వచ్చింది. బిల్లును చూసిన వస్రం దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. గతంలో మీటర్లో ప్రాబ్లమ్ ఉంది పాత బకాయి ఆరువేల రూపాయలు కట్టమని విద్యుత్ ఆఫీసర్లు చెప్పడంతో వస్రం మొత్తం బిల్లు చెల్లించాడు. అయినా సమస్య పరిష్కారం కాకపోగా బిల్లు లక్షల్లో రావడంతో ఆఫీసర్లే బాధ్యత వహించాలని కోరుతున్నాడు.

For More News..

కరోనా కేసుల్లో.. చైనాను మించిన మహారాష్ట్ర

టెన్త్ విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చేది ఇలాగే..

లాక్​‌డౌన్‌ దెబ్బకు అన్నీ డబుల్ రేట్లు

Latest Updates