వరదల వల్ల 35 వేల ఇండ్లకు కరెంట్​ కట్​

హైదరాబాద్‌‌, వెలుగు: వర్షాల ప్రభావంతో గ్రేటర్​ హైదరాబాద్‌‌లోని వందల ప్రాంతాల్లో ప్రజలు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు.  సబ్‌‌ స్టేషన్లలోకి నీళ్లు రావడం, కాలనీలు, అపార్ట్‌‌మెంట్లలోకి నీళ్లు రావడంతో అనేక చోట్ల కరెంట్​ కట్​ అయింది. సుమారు 35 వేల ఇండ్లకు విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. నీళ్ల తొలగింపు పూర్తయిన చోటల్లా విద్యుత్ సరఫరాను కొనసాగిస్తున్నామని డిస్కం వర్గాలు చెబుతున్నాయి.  వరదల వల్ల పలు ప్రాంతాల్లో, అదే విధంగా మూసీ నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న విద్యుత్‌‌  ట్రాన్స్​ఫార్మర్లు, కరెంటు పోల్స్​ వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో  విద్యుత్ శాఖకు  దాదాపు రూ. 5 కోట్ల వరకు నష్టం జరిగినట్లు ఆఫీసర్లు ప్రిలిమినరీ అంచనా వేశారు. ఎల్‌‌బీ నగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో వరదల ప్రభావం ఎక్కుగా ఉందని చెప్పారు. జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని 30 పట్టణాల్లో వర్షాలు, వరదల ప్రభావం తో చాలా కాలనీలు జలమయమయ్యాయి. . ట్రాన్స్ కో పరిధిలో 9 సబ్ స్టేషన్లు, ఎస్‌‌పీడీసీఎల్‌‌ పరిధిలో 15 సబ్ స్టేషన్లు, ఎన్పీడిసిఎల్ పరిధిలో 2 సబ్ స్టేషన్లలోకి నీళ్లు వచ్చినట్లు ఆఫీసర్లు గుర్తించారు.

For More News..

నగరంలో వరదల్లో గల్లంతై చనిపోయింది వీళ్లే..

హైదరాబాద్‌లో ఇంకా నీటిలోనే 800 కాలనీలు

అలర్ట్​ చేసింది లేదు..  ఆదుకున్నదీ లేదు

Latest Updates