
జియో ఫైబర్ మేనేజ్ మెంట్ పై విద్యుత్ ఏ ఈ ఎల్బీనగర్ పోలీసులకు కంప్లయంట్ చేశారు. ఆటో నగర్ ఎలక్ట్రిసిటీ ఏఈ శ్రీనివాస్, కాలనీ వాసులు తెలిపిన ప్రకారం.. సాయి సప్తగిరి కాలనీలో జియో ఫైబర్ సిబ్బంది కేబుల్ ఏర్పాటు చేస్తుండగా వైర్ కు కటింగ్ ప్లేయర్ కట్టి అవతలి వైపు పోల్ కు విసిరాడు. దీంతో 132 కేవీ హై టెన్షన్ వైర్ పై కేబుల్ పడి ఫైర్ యాక్సిడెంట్ జరిగి భారీ శబ్ధంతో మంటలు వచ్చాయి. రెండు స్థంభాలు ధ్వంసమై విరిగిపోయాయి. ఇండ్లలోని టీవీలు, ఫ్రిడ్జ్ లు, ఇతర ఎలక్ర్టానిక్ వస్తువులు కాలిపోయాయి. ఆ కేబుల్ విసిరిన జియో సిబ్బందితో పాటు ఒకరికి గాయాలయ్యాయి. సుమారు 10 లక్షల నష్టం జరగగా ఎలక్రిసిటీ డిపార్ట్మెంట్ రూ.1లక్ష నష్టపోయింది. స్థానికులు ఎలక్ర్టిసిటీ ఏఈకి తెలపగా ఆయన పోలీసులకు కంప్లయంట్ చేయగా కేసు ఫైల్ చేశారు.
see more news
ఐదు రోజుల్లో హాస్పిటల్ కట్టిన్రు
క్లిక్ చేస్తే చాలు.. అకౌంట్లోకి డబ్బులు!