ఎక్కింది.. తొక్కింది..!

‘ఏనుగమ్మా ఏనుగు.. మా ఊరొచ్చిందేనుగు..’ అని మన ఊరికి వచ్చిన గజరాజు గురించి పాడుకోవడం బాగానే ఉంటది గానీ, దాని ఊరికి వెళ్లినప్పుడు మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే ఈ కారులా అయిపోతది పరిస్థితి. ఏనుగు రోడ్డు దాటుతుండగా ఓ కారు రయ్యున దూసుకుపోయింది. ఆ ఏనుగును చూసి డ్రైవర్​ వెంటనే బ్రేకేశాడు. అంతే, ‘నా దారికే అడ్డొస్తవా’ అంటూ కోపంగా కారుపైకి ఎక్కేసింది గజరాజు. కారును తొక్కేసి దాదాపు నుజ్జు చేసినంత పనిచేసింది. అదృష్టం బాగుండి డ్రైవర్​ తప్పించుకున్నాడనుకోండి.  థాయిలాండ్​లోని నఖోన్​ రచ్చాసిమాలోని ఖావో యై నేషనల్​ పార్క్​లో అక్టోబర్​ 29న జరిగిందీ ఘటన.
ప్రత్య చుటిపస్కూల్​ అనే ఫొటోగ్రాఫర్​ ఈ ఏనుగు బీభత్సాన్ని క్లిక్​మనిపించాడు.

Latest Updates