కరెంట్ షాక్ తగిలి గున్న ఏనుగు మృతి

చిత్తూరు: విద్యుద్ఘాతంతో ఓ మూగజీవి మృతి చెందింది. పలమనేరు నియోజకవర్గం గొబ్బిళ్ళ కోటూరు గ్రామ సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఓ గున్న ఏనుగు చనిపోయింది. శనివారం రాత్రి సుబ్రహ్మణ్యం అనే రైతు పొలం పక్కనున్న ట్రాన్స్ ఫార్మర్  వద్దకు వచ్చిన  ఏనుగుకు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు తగిలింది . దీంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందిందనట్టు అటవీశాఖ అదికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన ఏనుగును చూడ్డానికి.. ‌ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సంఘటనా స్థలానికి  భారీగా చేరుకున్నారు.

Latest Updates