ఏనుగు నుంచి చలాకీగా తప్పించుకున్న డ్రైవర్

కార్లు కనిపిస్తే చాలు ఓ ఆటాడుకుంటున్నాయి ఏనుగులు. కాలుపెట్టి నుజ్జునుజ్జు చేసిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కొన్ని కార్లను ధ్వంసం చేసిన ఏనుగు..లేటెస్ట్ గా మరో కారును ధ్వంసం చేసింది. ఈ సారి పిల్లలు ఆడుకునే కారు అనుకుందో ఏమో..ఏకంగా కారుమీదికే రెండు కాళ్లు పెట్టి ఎక్కేసింది. ఈ సంఘటన థాయ్ లాండ్ లో జరుగగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

వివరాలు : థాయ్ లాండ్ లోని ఖావో యాయ్ నేషనల్ పార్క్ లోని డ్యూయా అనే 35 ఏళ్ల ఏనుగు సడెన్ గా రోడ్డుపైకి వచ్చింది. అదే సమయంలో రోడ్డుపైకి వచ్చిన కారు ఏనుగుకు చిక్కింది. ఒక్కసారిగా ఏనుగును చూసిన డ్రైవర్ కు ఏమి చేయాలో తోచక నిలిపివేశాడు. కారుపై నుంచి దాటాలను చూసినప్పటికీ ఏనుగుకు సాధ్యం కాలేదు. దీంతో కారు ఎక్కి దర్జాగా పోజు ఇచ్చింది.

కారులో ఉన్న డ్రైవర్ కు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఏనుగు నుంచి ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నాడు. కానీ ఏనుగు మాత్రం రెండు కాళ్ల మధ్యన కారును ఉంచి ఆటలాడింది. కాసేపటిదాకా వెయిట్ చేసిన డ్రైవర్ ..ఏనుగు కాలు తీయగానే తుర్రుమన్నాడు. హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా..డ్రైవర్ ధైర్యానికి మొచ్చుకోవాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Latest Updates