ఆర్మీ క్యాంటీన్‌లో దూరిన ఏనుగు.. జవాన్‌ దెబ్బకు పరార్: వీడియో

ఏనుగు ఇళ్ల మధ్యకు వచ్చిందంటే భయంతో జనం పరుగులు తీస్తారు.. దాన్ని అక్కడి నుంచి తరిమికొట్టడానికి నానా హంగామా చేయాల్సి వస్తుంది. పటాకులు పేల్చి, కర్రలతో తరుముకుంటే కూడా వెళ్లేది కష్టమే. కానీ, ఓ చిన్న టెక్నిక్‌తో ఆర్మీ క్యాంటీన్‌లోకి దూరిన ఏనుగును పరుగులు పెట్టించాడు ఓ జవాన్.

భూటాన్ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో… పశ్చిమ బెంగాల్ హసిమరా ప్రాంతంలో ఓ ఆర్మీ క్యాంప్ ఉంది. అందులోని క్యాంటీన్‌లోకి ఒక్కసారిగా ఓ ఏనుగు వచ్చింది. డైనింగ్ హాల్‌లో ఉన్న టేబుల్స్ అన్నీ చెల్లాచెదురుగా నెట్టేసింది. కిచెన్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. దాన్ని అడ్డుకునేందుకు ఒకరు పేపర్‌కు నిప్పు అంటించి దాన్ని బెదరగొట్టేందుకు ట్రై చేసినా.. అది ముందుకు దూసుకొచ్చింది. లోపలి నుంచి ఆర్మీ జవాన్ ఒకరు ఓ కర్రకు మంట అంటించుకుని వచ్చాడు. అతడు ముందుకు రాగానే తుర్రున పరుగు పెట్టింది ఏనుగు. వెనక్కి తిరిగి చూడకుండా బయటికెళ్లిపోయింది.

కాగా, ఆర్మీ క్యాంప్ ఉన్న ప్రాంతంలో చుట్టూ అడవి ఉండడంతో తరచూ ఇక్కడికి ఏనుగులు వస్తుంటాయి.

Latest Updates