సంపాదనలో బిల్ గేట్స్‌‌ను వెనక్కినెట్టిన మస్క్

ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలన్ మస్క్ అరుదైన ఘనతను సాధించారు. ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన మస్క్.. సంపాదనలో మరో కుబేరుడు బిల్ గేట్స్‌‌ను దాటిపోయారు. 49 ఏళ్ల మస్క్ 127.9 బిలియన్ల ఆదాయంతో బిల్ గేట్స్‌‌ను అధిగమించి వరల్డ్ సెకండ్ రిచెస్ట్ పర్సన్‌‌గా నిలిచారు. బిల్ గేట్స్ 127.7 బిలియన్ల ఆదాయంతో ఉన్నారు. మస్క్‌‌కు చెందిన టెస్లా షేర్లు, స్పేస్ ఎక్స్ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ కూడా 500 బిలియన్లకు చేరుకోవడం విశేషంగా చెప్పొచ్చు. బిల్ గేట్స్ తన సంపాదనంలో ఏటా కొంత భాగాన్ని డొనేషన్లకు ఇస్తారు. 2006 నుంచి ప్రతి ఏటా 27 బిలియన్లను నేమ్‌‌సేక్ ఫాండేషన్‌‌కు గేట్స్ ఛారిటీగా ఇస్తున్నారు.

Latest Updates