ఏం పేరు పెట్టావయ్యా : కొడుకు పేరు చెప్ప‌లేక‌ ఎలాన్‌ మస్క్ ఉక్కిరిబిక్కిరి

అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, స్పేస్‌ఎక్స్‌, టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్ కు త‌న కొడుకు పేరు త‌ల‌నొప్పిగా మారింది.

గతేడాది ఎలాన్ మ‌స్క్, గ్రీమ్స్ దంప‌తులు పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఆ స‌మ‌యంలో త‌న‌కు కొడుకు పుట్టాడ‌ని సోష‌ల్ మీడియా వేదికగా సంతోషం వ్య‌క్తం చేశారు. అంతేకాదు నెటిజ‌న్లు కొడుకు పేరు చెప్పాలని కోర‌డంతో త‌న కొడుకు పేరు ” ఏఎక్స్ ఏఈఏ -12 మ‌స్క్ ” అని ఎలాన్ మ‌స్క్ చెప్పారు. వింత‌గా .. గ‌జిబిజిగా, క‌ష్టంగా ఉన్న త‌న కొడుక్కి ఆ పేరు ఎందుకు పెట్టార‌నే విష‌యంపై ఈ వ్యాపార దిగ్గ‌జం స్పందించారు.

ఎలాన్ మాస్క్ దంప‌తులు కాలిఫోర్నియాలో నివ‌సిస్తున్నారు. కాలిఫోర్నియా నిబంధ‌న‌ల ప్ర‌కారం పేరులో ఇండో అర‌బిక్ అంకెలు ఉండ‌కూడ‌దు. దీంతో అర‌బిక్ అక్ష‌రాల‌ను మార్చి రోమన్ అంకెల్ని చేరుస్తూ “ఎక్స్ ఏఈఏక్స్ ఐఐ గా పేరు మార్చారు. ఆ పేరు ఎలా ప‌ల‌కాలో, ఎలా గుర్తుపెట్టుకోవాలో అర్ధం కాక‌ ఎలాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

తాజాగా ఎలాన్ జ‌ర్మ‌నీ బెర్లిన్ లో ఉన్న గిగా ఫ్యాక్టరీని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఓ రిపోర్టర్ ఎలాన్ మాస్క్ ను ” ఏఎక్స్ ఏఈఏ -12 మ‌స్క్ ” ఎలా ఉన్నారంటూ ప్ర‌శ్నించారు. రిపోర్టర్ అడిగిన ప్ర‌శ్న ఎలాన్ కు అర్ధం కాలేదు.

ఎలాన్ మ‌స్క్ కుమారుడి పేరు ” ఏఎక్స్ ఏఈఏ -12 మ‌స్క్ . ఆ పేరు గుర్తు లేదు. రిపోర్టర్ అడుగుతున్న ప్ర‌శ్న‌కు ఎలాన్ ద‌గ్గ‌ర‌ స‌మాధానం లేదు. దీంతో మ‌రోసారి రిపోర్టర్ అదే ప్ర‌శ్న అడ‌గంతో తేరుకున్న ఎలాన్ ఆ చాలా బాగున్నాడు. మీరు అడిగేది నా కొడుకు గురించేనా అని అనుమానంగా అన్నారు. అందుకు రిపోర్ట‌ర్ అవును మేం అడుగుతుంది మీ కుమారుడి గురించే అని చెప్ప‌డంతో..ఆ ఆ బాగున్నాడు. నాకు నా కొడుకు పేరు గుర్తుకు రావ‌డం లేదు. మ‌రోసారి వ‌స్తే వ‌చ్చేట‌ప్పుడు నా కొడుకుని వెంట‌తీసుకొని వ‌స్తా..ఎలా ఉన్నారో త‌న‌నే అడ‌గండి అంటూ చ‌మ‌త్కారంగా రిప్ల‌యి ఇచ్చారు. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

మ‌రో వైపు రిపోర్టర్ , ఎలాన్ మ‌స్క్ సంభాష‌ణ‌ల‌పై నెటిజ‌న్లు జోక్స్ పేల్చుతున్నారు. ఏం పేరు పెట్టావయ్యా ఎలన్‌ మస్క్ కామెంట్స్ చేస్తున్నారు.

Latest Updates