ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎమర్జెన్సీ సర్వీసులు: సీపీ మహేష్ భగవత్

రాచకొండ కమిషనరేట్ లో ఎమర్జెన్సీ సర్వీసు కోసం పలు వాహనాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. మహేంద్ర లాజిస్టిక్ లిమిటెడ్ కంపెనీ, రాచకొండ పోలీసులు సంయుక్తంగా  ఎమర్జెన్సీ వాహనాలు ప్రారంచినట్లు తెలిపారు. లాక్ డౌన్ కొనసాగుతుండటంతో.. వాహనాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీనియర్ సిటీజన్స్, మెడికల్ సర్వీసు కోసం ఎమర్జెన్సీ సర్వీసులను ఉపయోగిస్తామని చెప్పారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు …24 గంటల పాటు 5 వాహనలు అందుబాటులో ఉంటాయన్నారు. వీటితో పాటు రెండు అంబులెన్స్ లను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

8433958158 ఫోన్ చేసి వాహనాల సర్వీస్ ను ఊపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు. 9490617234  కరోనా కంట్రోల్ రూమ్ కు కాల్ చేస్తే అంబులెన్స్ లను అందిస్తామన్నారు. దీని కోసం మూడు షిఫ్ట్ లలో ముగ్గురు ఇన్స్పెక్టర్లను ఇంచార్జ్ గా నియమించామని తెలిపారు.

అంతేకాదు రాచకొండ కమిషనరేట్ లో సైకో సోషల్ కౌన్సిలింగ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు సీపీ మహేష్ భగవత్. ఇందులో మానసిక వ్యాధికి గురైన వారికి  వైద్య సేవలు అందుస్తున్నామన్నారు. లాక్ డౌన్ పిరేడ్ మొత్తం ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు సీపీ.

Latest Updates