EMI పెరిగింది : బ్యాంకు అప్పులపై పెరిగిన వడ్డీ రేట్లు

 బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్  బ్యాంక్  ఆఫ్  ఇండియా కీలకమైన నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీరేటు.. రెపోను వరుసగా రెండోసారి 25 బేసిస్ పాయింట్లు పెంచింది. జూన్ నెలలోనూ.. రెపోను 25 పాయింట్లు పెంచింది ఆర్బీఐ. ఇప్పటివరకు ఉన్న రెపో రేటు 6.25 నుంచి.. 6.50కు పెరిగింది. ఖరీఫ్ పంటలపై కేంద్రం మద్దతు ధర పెంచడం.. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు పెరగడం ఇందుకు కారణమని ఆర్బీఐ తెలిపింది. మూడు రోజుల సమావేశం తర్వాత.. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్  ఊర్జిత్ పటేల్ ప్రకటించారు.

రెపోరేటు పెంచటం వల్ల బ్యాంక్ నుంచి తీసుకున్న హౌస్ లోన్ ఈఎంఐ కూడా పెరగనుంది. ఉదాహరణకు రూ.30 లక్షలకు, 20 ఏళ్ల కాలపరిమితితో EMI చెల్లిస్తున్నట్లయితే ఇక నుంచి అదనంగా రూ.477 చెల్లించాల్సి వస్తోంది. అదే 75లక్షల అప్పుపై మాత్రం రూ.,1,192 అనదంగా EMI భారం కానుంది.

Posted in Uncategorized

Latest Updates