మజిలీ ట్రైలర్ : లవ్ లెటర్ లో పేరు వెడ్డింగ్ కార్డ్ లో ఉండదు

అక్కినేని నాగ చైతన్య, సమంత అక్కినేని కలిసి నటించిన క్రేజీ సినిమా మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ మరో కథనాయిక. గాఢమైన ప్రేమ విఫలమైన ఓ క్రికెటర్ జీవితంలో పెళ్లి తర్వాత భార్యతో జరిగిన సంఘర్షణే ఈ సినిమా ఇతివృత్తం. ఎంటర్ టైన్ మెంట్ కమ్ ఎమోషనల్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రూపొందింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. నాగచైతన్య, సమంత ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంటోంది.

నాగచైతన్య, సమంత మధ్య లవ్ ట్రాక్ కంటే.. వారిద్దరి మధ్య భావోద్వేగాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. “లవ్ లెటర్ లో ఉండే పేరు. వెడ్డింగ్ కార్డ్ లో ఉండదురా”  అని స్నేహితులు హీరోకు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ప్రేమ అనేది జీవితంలో ఓ మజిలీ మాత్రమే అనీ.. అదే జీవితం కాదనేది మెసేజ్ ఇస్తున్నట్టు మూవీ మేకర్స్ చెబుతున్నారు.

మజిలీకి గోపీసుందర్ పాటలు… తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. మజిలీ ఏప్రిల్ 5న విడుదలవుతోంది.

Latest Updates