పిల్లల్లో ఎమోషనల్ ఈటింగ్.. హైదరాబాద్ లోనే 59 శాతం ఒబేసిటీ

ఆన్ లైన్ క్లాసుల పేరుతో నిత్యం ఫోన్లు.. టీవీలకే అతుక్కుపోతున్నరు

ప్రమాదకరంగా మారుతున్న కొత్త ట్రెండ్

పెరుగుతున్న ఓబెసిటీ కేసులు

హైదరాబాద్ లోనే 59 శాతం పిల్లలకు ఒబేసిటీ

కరోనా వైరస్‌‌ నుంచి తట్టుకునేందుకు పిల్లలకు అవసరమైన దానికన్నా ఎక్కువ న్యూట్రిషియస్‌‌ ఫుడ్‌‌ ఇస్తున్నారు పేరెంట్స్‌‌. దాంతో ఎక్స్‌‌ట్రా కేలరీలు పేరుకుపోయి ఒబిస్‌‌గా మారుతున్నారు. పిల్లల్లో ఈ మార్పు చూసి పేరెంట్స్‌‌ టెన్షన్‌‌ పడిపోతున్నారు. న్యూట్రిషనిస్టులు, సైకాలజిస్టులను అప్రోచ్‌‌ అవుతున్నారు. పిల్లల్లో పెరిగిపోతున్న ఎమోషనల్ ఈటింగ్ వాళ్లకి ప్రమాదకరంగా మారుతోంది…

పిల్లలు కరోనా వల్ల దాదాపు ఆరు నెలలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టలే. స్కూలుకు పోలే. గ్రౌండ్‌‌లో కాలు పెట్టలే. ఇంట్ల కూడా ఏ పని చేయలే. పైగా రోజూ అమ్మ చేసి పెట్టిన ఫుడ్డు తింటూ టీవీలకు అతుక్కుపోయారు. దాంతో ఫిజికల్ యాక్టివిటీ లేక బరువు పెరుగుతున్నరుఎప్పుడూ గ్రౌండ్‌‌లోనే ఉండే పిల్లలు కూడా ఇప్పుడు ఆన్‌‌లైన్‌‌ క్లాసుల పేరుతో హాల్‌‌ నుంచి బయటకొస్తలేరు.

లాక్‌‌డౌన్‌‌తో పిల్లలు ‘ఒబీస్‌‌’ (స్థూలకాయులు)గా మారుతున్నారు. బోర్‌‌డమ్‌‌తో ‘ఎమోషనల్‌‌ ఈటింగ్‌‌’ చేస్తూ బాగా బరువెక్కుతున్నారు. హైదరాబాద్‌లో 59 శాతం పిల్లలు ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఈ మధ్య ఆ సంఖ్య మరింత పెరిగిందని డాక్టర్లు చెప్తున్నారు. ఏ ఫిజికల్‌‌ యాక్టివిటీ లేక ఇంట్లోనే ఉండడం, గంటల తరబడి టీవీ, సెల్‌‌ఫోన్లతో కాలక్షేపం చేయడం, ఆన్‌‌లైన్‌‌ క్లాసుల వల్ల స్మార్ట్‌‌ఫోన్‌‌ను ఎక్కువగా వాడడం ఒబెసిటీకి కారణం అవుతున్నాయి. అంతేకాదు, కరోనా వైరస్‌‌ నుంచి తట్టుకునేందుకు పిల్లలకు అవసరమైన దానికన్నా ఎక్కువ న్యూట్రీషియస్‌‌ ఫుడ్‌‌ ఇస్తున్నారు పేరెంట్స్‌‌. దాంతో ఎక్స్‌‌ట్రా కేలరీలు పేరుకుపోయి ఒబీస్‌‌గా మారుతున్నారు. పిల్లల్లో ఈ మార్పు చూసి పేరెంట్స్‌‌ టెన్షన్‌‌ పడిపోతున్నారు. న్యూట్రిషనిస్టులు, సైకాలజిస్టులను అప్రోచ్‌‌ అవుతున్నారు. పిల్లలకు సరిపడినంతే ఫుడ్‌‌ ఇచ్చి, ఫిజికల్‌‌ యాక్టివిటీని ఎంకరేజ్‌‌ చేయాలని ఎక్స్‌‌పర్ట్స్‌‌ సలహా ఇస్తున్నారు. ఇంట్లోని చిన్న చిన్న పనులను పిల్లలతో చేయించాలని అడ్వైజ్‌‌ చేస్తున్నారు.

ఆటలు, పాటలు లేవు

స్కూళ్లు మూతపడిన తర్వాత పిల్లల కష్టాలు పెరిగాయి. నార్మల్‌‌ డేస్‌‌లో ఉదయమే స్కూల్‌‌కు వెళ్లడం, చదువు, అల్లరి, గేమ్స్‌‌తో సందడిగా గడిపే పిల్లలకు ఇప్పుడవేమీ లేవు. రోజులకు రోజులు, నెలలకు నెలలు ఇంటికే కన్ఫైన్‌‌ కావాల్సి వచ్చింది. చూస్తే టీవీ, లేదంటే సెల్‌‌ఫోన్‌‌.. ఇవే వారికి కాలక్షేపాలు. అపార్ట్‌‌మెంట్‌‌లో ఉన్న ఫ్రెండ్స్‌‌తో కూడా ఆడుకోవడానికి వీల్లేదు. నో ప్లే.. ఓన్లీ ఎట్‌‌ హోమ్‌‌. ఇలాంటి పరిస్థితుల్లో ఏం తోచక ఏదో ఒకటి తినాలపిస్తుందని, దీన్ని బోర్‌‌డమ్‌‌ ఎమోషనల్‌‌ ఈటింగ్‌‌ అంటారని సైకాలజిస్టులు చెప్తున్నారు. అదే పనిగా టీవీ చూసినా ఆకలేస్తుందని, సెల్‌‌ఫోన్‌‌తో ఆడుతూ కూర్చున్నా ఆకలిగా ఉంటుందని అంటున్నారు. డిప్రెషన్‌‌లో జనం ఎక్కువ తింటారని, పిల్లలు ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నారని వాళ్లు  చెప్తున్నారు. నార్మల్‌‌ డేస్‌‌లో పేరెంట్స్‌‌ వర్క్‌‌తో బిజీబిజీగా ఉండేవాళ్లు. పిల్లలు ఏం తింటున్నారో పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ, ఇప్పుడు ఇంట్లోనే ఉండడంతో కేరింగ్​ పెరిగి పిల్లలకు ఎప్పుడూ ఏదో ఒకటి పెట్టడం, ఏది అడిగితే అది చేసి పెట్టడంతో వెయిట్‌‌ పెరుగుతున్నారని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు.

టీవీ, ఫోన్‌‌ అడిక్షన్‌‌

కరోనా ఎఫెక్ట్​తో స్కూల్స్​ రన్​ చేసే పరిస్థితులు లేకపోవడంతో టీచర్లు ఆన్​లైన్‌‌లో​ వీడియో క్లాసులు తీసుకుంటున్నారు. దాంతో పిల్లలు స్కూల్ టైమింగ్స్‌‌కి అనుగుణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు లెసన్స్‌‌ వింటున్నారు. ఫోన్ ఎక్కువగా యూజ్‌‌ చేయడం వల్ల కూడా పిల్లలకు ఎప్పుడూ ఏదో ఒకటి తినాలి అనిపిస్తుందని సైకాలజిస్ట్‌‌లు అంటున్నారు. రోజంతా ఇంట్లోనే ఉండటంతో  బాడీకి ఎలాంటి ఫిజికల్ స్ట్రెయిన్ లేక లేజీనెస్‌‌తో కూడా తినడం అలవాటు చేసుకుంటున్నారని చెప్తున్నారు.

ఒబెసిటీ సమస్యలు

పిల్లల్లో బరువు సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనిపై అనేక సర్వేలు కూడా చేశారు. లాక్‌‌డౌన్ కంటే ముందే హైదరాబాద్‌లో 59 శాతం మంది పిల్లలు అన్‌‌హెల్దీ బాడీ మాస్ ఇండెక్స్‌‌తో ఉన్నారు. స్పోర్ట్స్ విలేజ్ అనే సంస్థ జనవరిలో 7 నుంచి 17 సంవత్సరాల ఏజ్‌‌గ్రూప్‌‌ పిల్లల్లోని ఒబెసిటీ సమస్యలపై 250 సిటీస్‌‌లోని  స్కూళ్లలో  సర్వే చేసింది. ఇందులో భాగంగా 1,49,833 మంది పిల్లల హెల్త్ ఇష్యూస్,  ఒబెసిటీ, న్యూట్రిషనల్ లెవల్స్ లాంటి విషయలను తీసుకున్నారు. వచ్చిన రిజల్ట్‌‌లో హైదరాబాద్‌లో 59 శాతం స్టూడెంట్స్ అన్‌‌హెల్దీగా ఉన్నట్లు తేలింది. లాక్ డౌన్‌‌తో ఈ పర్సెంటేజ్ ఇంకా పెరిగి ఉండవచ్చని న్యూట్రిషనిస్టులు అంచనా వేస్తున్నారు. ఇంట్లో ఉండటం వల్ల రోజూ తినే మీల్‌‌ కన్నా ఎక్స్‌‌ట్రా క్వాంటిటీ తీసుకుంటున్నారని, పేరెంట్స్ కూడా అడ్డు చెప్పకుండా ఎంకరేజ్‌‌ చేస్తున్నారని అంటున్నారు. పిల్లలు ఒబిస్‌‌గా మారడానికి ఇదో కారణమని చెప్తున్నారు. ఇమ్యూనిటీ పేరుతో తీసుకునే ఎక్స్‌‌ట్రా కేర్‌‌ కూడా బరువు పెరగడానికి మరో కారణం.

పిల్లల్ని బిజీగా ఉంచాలి

కరోనా భయంతో పిల్లల్ని బయటకు పంపడానికి పేరెంట్స్‌‌ ఇష్టపడడంలేదు. అపార్ట్‌‌మెంట్లలో కూడా పిల్లల్ని వాళ్ల ఫ్రెండ్స్‌‌తో కలిసి ఆడుకోనివ్వడానికి ఇంట్రెస్ట్‌‌ చూపడంలేదు. పిల్లల్ని ఇంట్లోనే ఉంచేయాలనుకుంటే వాళ్లతో ఏదో ఒక ఫిజికల్‌‌ యాక్టివిటీ చేయించాలని ఎక్స్‌‌పర్ట్స్‌‌ సూచిస్తున్నారు. ఇంట్లోనే పరుగులు పెట్టేలా చూడాలని, పిల్లల ఏజ్‌‌ని బట్టి ఇంట్లో చిన్న చిన్న పనులు చెప్పాలని అడ్వైజ్‌‌ చేస్తున్నారు

ఇంట్లో పని చెప్పండి

ఆన్‌లైన్‌ క్లాసులు, లాంగ్‌‌ హోం స్టేలతో బోరింగ్  ఫీల్ అయి పిల్లలు టీవీ, ఫోన్‌‌, ఎలక్ట్రానిక్‌‌ గాడ్జెట్స్‌‌కి అలవాటు పడ్డారు. వీడియో గేమ్‌‌లతో గంటలు గంటలు గడుపుతున్నారు. అయితే, ఇది ముందు నుంచి ఉన్న సమస్యే అయినా లాక్‌‌డౌన్‌‌తో మరింత ఎక్కువైంది. ఫిజికల్‌‌ యాక్టివిటీ లేక పిల్లలు బరువు పెరుగుతున్నారు. పిల్లలతో స్పెండ్‌‌ చేయడానికి పేరెంట్స్‌‌కి ఎక్కువ టైమ్‌‌ దొరకడం కూడా సమస్యగానే మారింది. ఓవర్‌‌ కేరింగ్‌‌ వల్ల పిల్లలకు ఎప్పుడూ ఏదో ఫుడ్‌‌ పెట్టడం, ఏది కావాలని అడిగితే అది చేసి పెట్టడం కూడా ఒబెసిటీకి దారి తీస్తోంది. దీనిపై పేరెంట్స్‌‌ టెన్షన్‌‌ పడి మమ్మల్ని అప్రోచ్‌‌ అవుతున్నారు. పిల్లలకు ఫిజికల్‌‌ గేమ్స్‌‌ అలవాటు చేసి డే అంతా బిజీగా ఉండేలా చూడడం మంచిది.-డా.అలోక్ రాథ్, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ సర్జరీ బేరియాట్రిక్ సర్జన్, కేర్ హాస్పిటల్స్

 

బోర్ డమ్ పోగొట్టేలా..

ఇంట్లో ఉండడం వల్ల పిల్లలు బరువు పెరిగారని పేరెంట్స్‌‌ అంటున్నారు. బోర్‌‌డమ్‌‌ని బీట్ చేయడానికి పిల్లలు ఎమోషనల్ ఈటింగ్ చేస్తున్నారు. దాంతో బరువు పెరుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్‌‌కు సొల్యూషన్‌‌ ఏంటని పేరెంట్స్ మమ్మల్ని అడుగుతున్నారు.  పిల్లలకు ఇష్టమైన ఫిజికల్‌‌ యాక్టివిటీలో ఎంగేజ్‌‌ చేయాలి. రోజంతా డిఫరెంట్‌‌ యాక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో  మొక్కలకు నీళ్లు పట్టడం, యోగా, మెడిటేషన్లు చేయించాలి. ఒకేచోట నెలల తరబడి ఉండటం కూడా ఒబెసిటీకి కారణం. దాన్ని పేరెంట్స్ డిప్రెషన్‌‌గా భావించొద్దు. ప్రాపర్ కేర్ తీసుకుని ఫిజికల్ యాక్టివిటీస్‌‌తో ఎంగేజ్ చేస్తే పాజిటివ్‌‌ రిజల్ట్ వస్తుంది. -వీరేందర్, సైకాలజిస్ట్

 

Latest Updates