ప్రేమంటే ఇదేరా!.. మెట్రోలో వృద్ధ జంట ఆప్యాయత ఫొటో వైరల్

చిగురించడం, బ్రేకప్ కావడం… రెండూ చాలా సింపుల్ విషయాలుగా మారిపోయాయి. ఇక ముడుముళ్ల బంధం కూడా బలహీనమైపోయింది. చిన్న చిన్న విబేధాలతోనే విడాకులకు రెడీ అవుతున్న జంటలు పెరిగిపోతున్నాయి. ఇది నాణేనికి ఒకవైపే… రెండో వైపూ ఉంది… వివాహ బంధంపై చెప్పలేనంత గౌరవం. మనవళ్లు, మనవరాళ్లకు పెళ్లిళ్లయినా… వాళ్ల ప్రేమానురాగాల్లో ఏ మాత్రం తేడా ఉండదు. కొత్తగా పెళ్లయిన జంటలానే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వాళ్ల ఆత్మలు కలిసిపోయి ఉంటాయి. అలాంటి ఓ జంటను చూసి ఇంటర్నెట్ ఫిదా అయింది.

కోల్‌కతా మెట్రో రైలులో ఓ వృద్ధ జంట ఫొటో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. రైలులో కూర్చున్న తాతయ్య భుజంపై మఫ్లర్ వేస్తున్న ఆ బామ్మ ఆప్యాయతను చూసి ప్రేమంటే ఇదేరా అంటున్నారు. రిషి బగ్రీ అనే ట్విట్టర్ యూజర్ తన అకౌంట్‌లో ‘పిక్చర్ ఆఫ్ ది డే’ అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫొటో పోస్ట్ చేసి 24 గంటలు కూడా గడవక ముందే 2600 మంది లైక్ కొట్టారు. 250 మంది రీట్వీట్ చేశారు. ఈ పొటో చూసి చాలా మంది కోల్‌కతా మెట్రోలో అంటూ కామెంట్లు పెట్టారు. ఇది కదా పరిపూర్ణమైన జీవితం అంటూ కొందరు కామెంట్లు చేశారు. మరికొందరు ఆ వృద్ధ జంట వెనుక కనిపిస్తున్న ‘‘చిరునవ్వుతో.. జీవితం అంతా మీతోనే’ ఎల్ఐసీ యాడ్‌ కోట్ వీళ్లకు బాగా సూట్ అయిందంటూ తమ ప్రేమను చాటుకున్నారు.

MORE NEWS: 

అమ్మలా మారి కూతురికి చనుబాలు పట్టిన నాన్న

హెలికాప్టర్‌లో కూతురిని అత్తారింటికి పంపిన తండ్రి

కాలిపై కాలేసుకుని కూర్చోవద్దు: అమెరికా డాక్టర్ సలహా

Latest Updates