పిల్లలని ఇతరులతో పోల్చొద్దు ..!

పిల్లలు నలుగురితో కలిసిపోవాలంటే.. ఇతరులతో పోల్చడం మానేయాలి. చిన్నారుల్లో ఎమోషన్స్, ఇన్‌‌‌‌ఫీరియారిటీ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుందని చైల్డ్ కేర్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ఇతరులతో పోల్చడం, వెక్కిరించటం, పేర్లు పెట్టడం, మిగతా పిల్లల ముందు తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదు. ప్రతి మనిషికి తమదంటూ ఒక స్పెషల్ ఎక్స్ప్ ప్రెష‌ న్ ఉంటుంది. ప్రతీదానినీ “ఇలాగే చేయాలి” అని కట్టడి చేయాల్సిన పని లేదు. కాబట్టి, ఇతరులతో పోల్చకూడదు. మిగిలిన పిల్లలతో పోల్చి నువ్వు ఎందుకూ పనికిరావు అన్న ఒక మాట వాళ్ల‌లో ఇన్ ‌‌‌‌ఫీరియారిటీ ఫీలింగ్ ని పెంచుతుంది.

అలాగే పిల్లల్లో ఎవర్నో ఒకర్ని ఎక్కువగా ఇష్టపడటం మిగిలిన వారిని అంతగా ఇష్టపడకపోవడం అన్నది కూడా చాలా తప్పు. పిల్లల మధ్య తేడా చూపించడం వాళ్ల‌ను డిప్రెషన్ లో పడేస్తుంది. మనం చెప్పింది వాళ్లు వింటున్నట్టే వాళ్లు చెప్పింది కూడా మనం ఓపిగ్గా వినాలి. వాళ్లు మనసులో ఏమనుకుంటున్నారో, వాళ్లు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్ధం చేసుకోవాలి. ఏ విష‍యమైనా చెప్పగలిగే స్వేచ్చ పిల్లలకి ఇవ్వాలి. అప్పుడే వాళ్లు మనతో ఫ్రెండ్లీగా ఉంటారు. లేదంటే అన్నివిషయాలు తమలో దాచుకుని సమస్యకు ఏ సొల్యూషన్ దొరక్క తోచిన నిర్ణ‌యాలతో సమస్యల్లో పడతారు. అందుకే పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Latest Updates