ఉద్యోగులు రోజూ 12 గంటలు పని చేయాలి: జాక్ మా

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా గ్రూప్‌ ఛైర్మన్‌ జాక్‌ మా వివాదాస్పద వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఆయన తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులు… వారంలో ఆరు రోజుల పాటు రోజుకు 12 గంటల చొప్పున పని చేయాలన్నారు. ఇటీవల కంపెనీలో జరిగిన అంతర్గత సమావేశంలో జాక్‌ మా సంస్థ ఉద్యోగులను ఉద్ధేశించి మాట్లాడారు. 8 గంటలు పనిచేసే సంస్కృతికి స్వస్తి చెప్పాలని రోజుకు 12 గంటలు పనిచేయటం అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఈ విషయాని ఆలీబాబా అధికారిక వైబో అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. అన్ని చోట్లా అందరూ 996 పని సంస్కృతి అలవాటు చేసుకోవాలని, అలా పనిచేయడం అదృష్టంగా భావించాలన్నారు. అంటే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వారంలో ఆరు రోజులు పనిచేయాలన్నది జాక్‌ మా ఉద్ధేశం.

 

Latest Updates