పాన్‌కార్డు ఇవ్వకపోతే 20 శాతం పన్ను

పాన్‌కార్డు గానీ లేదంటే.. ఆధార్‌ కార్డు ఇవ్వని ఉద్యోగులకు 20 శాతం వరకు లేదా అత్యధిక రేటుతో పన్ను మొత్తాన్ని జీతాలు ఇచ్చే సమయంలో టాక్స్ డెడెక్టెడ్ ఎట్ సోర్స్ (TDS)  చేయాలని ఆదాయపు పన్ను శాఖ అన్ని సంస్థల యాజమాన్యాలకు మరోసారి తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఉద్యోగులు తమ పాన్‌ కార్డు వివరాలను యాజమాన్యాలకు అందజేయాలి. ఒక వేళ ఇవ్వకపోతే 20 శాతం మొత్తం కానీ, చట్టంలో వర్తించే రేటు ప్రకారం గానీ ఏది ఎక్కువ అయితే అంత మొత్తాన్ని పన్ను రూపంలో వారి దగ్గరనుంచి కట్ చేయాలి. తాజా సంవత్సరం చివరికి రావడంతో ఆయ సంస్థలు లెక్కలు సిద్ధం చేస్తుంటాయి. ఈ క్రమంలో ప్రకటన చేసింది. సాధారణంగా 20 శాతం శ్లాబు కంటే తక్కువలోకి వచ్చే ఉద్యోగులు పాన్‌, లేదా ఆధార్‌ నంబర్‌ ఇవ్వకపోతే వారికి జీతంలో 20 శాతం పన్ను కోత విధిస్తారు. అదే 20 శాతం శ్లాబు దాటితే ఎంత అయితే అంత కోత విధించడంతో పాటు 4 శాతం హెల్త్‌, ఎడ్యూకేషన్‌ సెస్‌ కూడా వసూలు చేస్తారు.

Latest Updates