SC నిరుద్యోగులకు ఉపాధి: స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్.. ఎస్సీ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. గ్రామాల్లో లక్షన్నర, సిటీలో 2లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి….. స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు నేర్పిస్తోంది.  ట్రాన్స్ పోర్ట్, ఐటీ, లెదర్, మెడికల్ సర్వీస్, హాస్పిటాలిటీ, కన్ స్ట్రక్షన్.. లాంటి కోర్సుల్లో…  శిక్షణ ఇస్తోంది.

ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ తో పాటు కొన్ని కంపెనీలతో టైఅప్ అవుతోంది TS CCDC.  జాతీయ నిర్మాణ రంగ సంస్థ, జాతీయ పర్యాటక, ఆతిధ్య నిర్వహణ సంస్థ, అపోలో మెడ్ స్కిల్స్, నిమ్స్ మె, జాతీయ చిన్న పరిశ్రమల సంస్థతో పాటు మరి కొన్ని సంస్థలతో ఎంవోయులు కుదుర్చుకుంది. త్వరలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్, టీఎస్ ఆర్టీసీ శిక్షణ సంస్ధలతోనూ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు చెబుతున్నారు.

జిల్లాల వారీగా.. మొబిలైజేషన్ క్యాంప్ లను నిర్వహిస్తోంది TS CCDC. ఈ క్యాంపుల్లో అర్హత, ఆసక్తిని బట్టి… ఆయా కోర్సులను ఎంపిక చేస్తోంది. ఎంవోయూ కుదుర్చుకున్న సంస్థల ద్వారా… మెడికల్ రంగంలో కార్డియాలజీ, డయాలసిస్, ఆపరేషన్ థియేటర్, డెంటల్ కోర్సులతో పాటు షెఫ్ ట్రైనింగ్, బేకరీ, టైలరింగ్, మేకప్, వెల్డింగ్, యానిమేషన్ కోర్సులను కూడా నేర్పిస్తోంది.

గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 16 వందల మంది శిక్షణ పొందారు. వీళ్ళల్లో 600 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం మరో 5 వందల మంది  ట్రైనింగ్ లో ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకొని… ఏడాది పాటు ఉద్యోగం చేసి.. అనుభవం సంపాదించాక .. ఆంట్రప్రెన్యూర్స్ గా అయ్యే అవకాశాలు కల్పిస్తోంది TS CCDC.  వీళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు కూడా ఇప్పిస్తోంది.

ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ లెక్కల ప్రకారం… రాష్ట్రలో 2 లక్షల 20 వేలకు పైగా ఎస్సీ నిరుద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్ళందరికీ … ప్రభుత్వ ఉద్యోగాలు రావడం కష్టం. దీంతో నిరుద్యోగులందరికీ స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ అందిస్తున్నట్లు చెబుతున్నారు  TS CCDC అధికారులు. నిరుద్యోగ ఎస్సీ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

 

Latest Updates