4ఏళ్లలో.. లక్షలు ఎంఎస్ఎంఈల్లో ఉద్యోగాలు

దేశంలో ఇటీవల నిరుద్యోగం భారీగా పెరిగిందన్న మాటల సంగతి ఎలా ఉన్నా తాము మాత్రం పెద్దఎత్తున జాబులు ఇచ్చామని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. గత నాలుగేళ్లలో టోటల్ గా దాదాపు నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని స్పష్టం చేశాయి. ఈ విషయాలను తాజాగా ఒక సర్వే వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు అధికార బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్న ‘ముద్ర’ స్కీం ప్రభావం గురించి ఆ స్టడీ రిపోర్టు ప్రస్తావించకపోవటం చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఈ నాలుగు సంవత్సరాల్లో నికరంగా 3 లక్షల 32 వేల మంది ‘కొలువు’దీరినట్లు ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’ (సీఐఐ) క్లెయిమ్ చేస్తోంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో లక్షకు పైగా సంస్థల్లో సర్వే చేసి ఆ వివరాలతో కూడిన రిపోర్టును ఈమధ్య విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ‘మైక్రో, స్మాల్ , మీడియం ఎంటర్ ప్రైజెస్’ (ఎంఎస్ ఎంఈ) రంగం ఉద్యోగ కల్పనలో ఏడాదికి 3.3 శాతం కాంపౌన్డెడ్ గ్రోత్ రేట్ తో నాలుగేళ్లలో 13.9 శాతం వృద్ధిని సాధించింది. ఈ మూడు రకాల పరిశ్రమల్లో మైక్రో ఎంటర్ ప్రైజెస్ అత్యధిక జాబ్ క్రియేటర్స్​గా నిలిచింది. ఈ కంపెనీలు ఒక్కటే ఏకంగా 2 లక్షల 40 వేల 713 నౌకరీలను సృష్టించా యి. మొత్తం వేకెన్సీల్లో 73 శాతాన్ని ఇవే భర్తీ చేశాయి. ఆ తర్వాత.. స్మాల్ ఎంటర్ ప్రైజెస్ 23 శాతం మందిని రిక్రూట్ చేసుకున్నాయి. మీడియం ఎంటర్ ప్రైజెస్ 4 శాతం ప్లేస్ మెంట్లను మాత్రమే ఇచ్చాయి. ఆయా పోస్టుల్లో చేరిన మొత్తం అభ్యర్థు ల సంఖ్య నుంచి జాబు మానేసినవాళ్ల సంఖ్యను తీసేస్తే వచ్చే నంబరే ‘నికర ఉద్యోగాలు’ అని సర్వే స్పష్టం చేసింది.

ఆ ‘ముద్ర’ పడలేదుఏదీ?
ఈ రీసెర్చ్​లో ‘ప్రధానమంత్రి ముద్రా యోజన’ ( పీఎంఎంవై) వల్ల ఎంత మంది నిరుద్యోగులకు ఉపాధి దొరికిందో, ఉద్యోగ కల్పనలో ఆ స్కీమ్ పాత్రేమిటో మాట వరసకైనా చెప్పలేదు. మైక్రో యూనిట్స్​ డెవలప్ మెంట్ అండ్ రీఫైనాన్స్​ ఏజెన్సీ లిమిటెడ్ (ఎంయూడీఆర్ ఏ: ముద్ర) పథకాన్ని ప్రధాని మోడీ 2015 ఏప్రిల్ 8న ప్రారంభించా రు. ఇందులో భాగంగా నాన్ –కార్పొరేట్ , నాన్ –ఫార్మ్​ స్మాల్ /మైక్రో ఎంటర్ ప్రైజెస్ కి రూ.10 లక్షల వరకు లోన్లు ఇస్తారు. రుణాలిచ్చే బాధ్యతను కమర్షియల్, రీజనల్ రూరల్, స్మాల్ ఫైనాన్స్​ బ్యాంకులకు; నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్​ కార్పొరేషన్లకు; మ్యూచ్ వల్ ఫండ్ సంస్థలకు అప్పగించారు.

ఈ లో న్ స్కీ మ్ వల్ల యువతకు పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు లభించాయని సర్కారు, బీజేపీ నాయకగణం, థర్డ్​ పార్టీ సంస్థలు ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చాయి. గత నాలుగేళ్లలో ఈ పథకం 3 కోట్ల మందికి జాబులిచ్చిందని ఎంఎస్ ఎంఈ శాఖ సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్ గత నెలలో తెలిపారు. ఈ సంఖ్య 5 కోట్ల నుంచి 7.28 కోట్ల వరకు ఉంటుం దని మరికొం త మంది కాషాయ దళం నేతలు ప్రెస్టేజీగా ప్రకటించారు. సెంట్రల్ మినిస్టర్ వెల్లడించి న సంఖ్యకి ఇది డబుల్ కావటం గమనార్హం.

ఏది నిజం? ఏది అబద్ధం?
న్యూఢిల్లీకి చెందిన స్కో చ్ సంస్థ సరికొత్త రిపోర్ట్​ని సిద్ధం చేసింది. 2015–17లో ‘ముద్ర’ స్కీమ్ తో 1.7 కోట్ల ఇంక్రిమెంటల్ జాబ్స్ క్రియేట్ అయినట్లు పొందుపరిచింది. సీఐఐ స్టడీయేమో 3.32 కోట్ల ఉద్యోగాలు వచ్చాయంటోంది. ప్రముఖ ఇంగ్లిష్ మీడియా సంస్థేమో గవర్నమెంట్ సొంత డేటాను రిఫర్ చేస్తూ 2012–15లో (మూడేళ్లలో) ఎంఎస్ ఎంఈ రంగంలో 11 లక్షల 54 వేల 23 కొలువులు వచ్చినట్లు వార్తను ప్రచురించింది. అయితే ఆ నంబర్ టోటలా లేక నెట్టా అనేది క్లియర్ గా రాయలేదు. సీఐఐ డేటా ప్రకారం నాలుగేళ్లలో ఉద్యోగ కల్పనలో 13.9 శాతంగా నమోదైన గ్రోత్ రేటును టోటల్ లేబర్ ఫోర్స్​(4 కోట్ల 50 లక్షల)కి అప్లై చేస్తే ఏడాదికి కోటీ 49 లక్షల జాబ్స్​ కొత్తగా వచ్చినట్లు. దీనికి సాంప్రదాయిక వృద్ధి రేటును (3 శాతాన్ని) కలిపితే ఎక్ స్ట్రా కోటీ 35 లక్షల కొలువుల సృష్టి జరిగి ఉండాలి. ఈ లెక్కలన్నింటినీ చూస్తుంటే ఏది నిజమో? ఏది అబద్ధమో? అర్థం కావట్లేదు. లోక్ సభ ఎన్నికల ప్రకటన వచ్చి , పొలిటికల్ పార్టీలన్నీ ప్రచారంలో బీజీ అయిన నేపథ్యంలో క్లారిటీని ఆశించటం అత్యాశే అవుతుందేమో.

Latest Updates