జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఉగ్రవాది మృతి

జమ్మూకశ్మీర్ లోని సోపోర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో లష్కరే తయిబా టాప్ ర్యాంక్ ఉగ్రవాది అసిఫ్ ను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ మధ్య సోపోర్ లో పండ్ల వ్యాపారిపై జరిగిన కాల్పులకు అసిఫ్ ప్రధాన సూత్రధారి. పండ్ల వ్యాపారిపై కాల్పులు జరపగా ముగ్గురు గాయపడ్డారు. అందులో రెండున్నరేళ్ల పాప కూడా ఉంది. సోపోర్ లో వలస కార్మికులపై కాల్పులు జరిపింది కూడా అసిఫేనని బలగాలు తెలిపాయి. నిన్న 8 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే ఈ ఎన్ కౌంటర్ జరిగింది.

Latest Updates