కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం

ఒక పక్క దేశం మొత్తం కరోనావైరస్ పై పోరాడుతుంటే.. మరోపక్క ఉగ్రవాదులు ఇదే అవకాశంగా భావించి బార్డర్ లో దాడులకు తెగబడుతున్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని మెల్‌హోరా గ్రామంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

మెల్‌హోరా గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు వచ్చిన సమాచారం మేరకు గ్రామాన్ని ముట్టడి చేసినట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. అనుమానం ఉన్న ప్రాంతంలో ఆర్మీ కాల్పులు జరిపిందని.. వెంటనే అటు వైపు నుంచి కూడా కాల్పులు జరిగాయని ఆయన తెలిపారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని.. వారిని ఇంకా గుర్తించలేదని ఆయన తెలిపారు.

For More News..

ఆటలో గొడవ.. ఒకరిని చంపి కాల్చేసిన స్నేహితులు

ఆట అంటే వీళ్ళది.. ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి టెన్నిస్.. వీడియో వైరల్

‘కరోనా జంతువుల నుంచే వచ్చింది.. ల్యాబ్ నుంచి కాదు’

Latest Updates