ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోలు మృతి

ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఇద్దరు మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. వెంకటాపురంలో ఇటీవల భీమేశ్వరరావును హత్య చేశారు మావోలు. దాంతో అలర్ట్ అయిన పోలీసులు గ్రామాలను జల్లెడ పడుతున్నారు. మంగపేట మండలం నరసింహ సాగర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతుండగా..  కొప్పు గుట్ట దగ్గర పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారని తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం దీన్ని అధికారికంగా ప్రకటించడం లేదు.

Latest Updates