పుల్వామాలో ఎన్ కౌంటర్: నలుగురు టెర్రరిస్టులు హతం

encounter-in-pulwama-four-terrorists-killed

జమ్ముకశ్మీర్ పుల్వామాలోని లస్సిపొరాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. లస్సిపొరా ఏరియాలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో టెర్రరిస్టులు ఎదురుపడ్డారు. దీంతో కాల్పులు జరిగాయి. తప్పించుకునేందుకు ఉగ్రవాదులు ఆర్మీపై ఫైరింగ్ చేశారు. అయితే ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన జవాన్లు వారిని హతమార్చారు. AK సిరీస్ రైఫిల్స్ ను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. మరికొంత మంది ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి భద్రతా దళాలు.

Latest Updates