పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు మృతి

ఇద్దరు ఉగ్రవాదులు మరియు ఒక సహచరుడు మృతి
కశ్మీర్ లోని గోరిపోరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

జమ్మూ కాశ్మీర్‌.. పుల్వామా జిల్లాలోని అవంతిపోరాలో శనివారం ఉదయం ఉగ్రవాదులకు మరియు జవాన్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులతో పాటు వారి సహచరుడు ఒకరు మరణించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌.. షోపియాన్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌ను పోలి ఉంది. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ గ్రూపుకు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ నలుగురిలో ఒక టాప్ కమాండర్ కూడా ఉన్నారు.

For More News..

లాక్డౌన్ లో కొత్త దందా.. కారు ఫేక్ పాస్ కు రూ. 30,000

‘పీఎం కేర్స్ ఫండ్’పై ఆడిటింగ్ ఉండదు!

శ్రీలంక నేవీలో 29 మందికి ​ కరోనా పాజిటివ్​

Latest Updates