సెకండ్ టెస్టులోనూ రాణించిన కివీస్

క్రైస్ట్‌చర్చ్‌:  సెకండ్ టెస్టులోనూ టీమిండియాను ఆడుకుంటుంది కివీస్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ బౌలర్లు తమ హవాను కొనసాగాంచారు. ఫస్ట్ ఇండియాను…. మొదటి ఇన్నింగ్స్ లో 242 రన్స్ కు ఆలౌట్ చేసిన కివీస్.. ఆపై తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. ఓపెనర్  టామ్  లాథమ్ 27 రన్స్… బ్లండెల్ 29  పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

అంతకు ముందు భారత్  242 రన్స్ కు  ఆలౌటైంది. కివీస్ బౌలర్ల ధాటికి… టీమిండియా  బ్యాట్స్ మెన్  నిలువలేక పోయారు. ముగ్గురు బ్యాట్స్ మెన్లు  మినహా  ఎవరు పెద్దగా  రాణించలేదు. ఓపెనర్  పృథ్వీ షా.. హాఫ్  సెంచరీతో  ఆకట్టుకున్నాడు. 64 బాల్స్ లో …54 రన్స్  చేశాడు. మరో ఓపెనర్  అగర్వాల్  మాత్రం  7 పరుగులు  చేసి ఔట్  అయ్యాడు… ఇక ఫస్ట్ డౌన్ లో  వచ్చిన పుజారా… 54 రన్స్ తో  పర్వాలేదనిపించాడు.  దీంతో కివీస్ గడ్డపై   తొలి అర్ధ సెంచరీని  నమోదు చేసుకున్నాడు.  అయితే  కెప్టెన్  కోహ్లీ మాత్రం  మరోసారి నిరాశపరిచాడు. కేవలం  3 పరుగులు చేసి  పెవిలియన్ చేరాడు.

ఫస్ట్ టెస్టులో  రాణించిన  రహానె   ప్రస్తుతం 7 పరుగులకే  పరిమితమయ్యాడు. అయితే  మిడిలార్డర్ లో  వచ్చిన  విహారి 55  పరుగులు  చేశాడు. చివర్లో ఎవరు  పెద్దగా రాణించలేదు. పంత్  12,  జడేజా  9, షమీ 16  పరుగులు చేశారు. తొలి రోజు  మూడవ సెషన్ లో  కేవలం పది  ఓవర్లలోనే  భారత్ చివరి అయిదు  వికెట్లను  కోల్పోయింది. కివీస్  బౌలర్లలో  జేమిసన్ కు …ఐదు వికెట్లు దక్కాయి.  సౌథీ, బౌల్ట్ లు… చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Latest Updates