శివకుమార్ విచారణకు సహకరించట్లేదు: ఈడీ

ఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ ను 14 రోజుల కస్టడీలోకి తీసుకుంటామని ఈడీ( ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ) సీబీఐ స్పెషల్ కోర్టును కోరింది. ఆయన్ను కస్టడీలో ఉంచి విచారణ చేపట్టాలని తెలిపింది. శివకుమార్ తప్పుడు సమాధానాలు చెబుతూ విచారణకు సహకరించలేదని, ఆయన్ను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరముందని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు.

మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివకుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా  ఈడీ తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా శివకుమార్ కు కొన్ని రోజుల క్రితం సమన్లు జారీ చేసింది. విచారణ నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన ఆయన్ను ఈడీ అరెస్ట్ చేసి 14 రోజుల కస్టడీని విధించింది. తాజా పరిణామాలు, కాంగ్రెస్ నేతలు వరుసగా సీబీఐ కి టార్గెట్ గా మారుతుండడంతో కర్ణాటకలో పార్టీ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు.

Latest Updates