ఇది వెరైటీ.. దెయ్యాలతో ప్రి-వెడ్డింగ్ ఫొటోషూట్

హారిబుల్ ఎంగేజ్ మెంట్ అంటే ఇదేనేమో

త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఓ జంట సరదాగా పార్క్​కు వెళ్లారు. కాసేపు చేతిలో చెయ్యేసి కబుర్లు చెప్పుకున్నారు. ఓ చోట కూర్చొని ఏదైనా తింటూ మాట్లాడుకుందామనుకున్నారు. కానీ తమను ఓ ఘోస్ట్​ వెంటాడుతోందని గుర్తించలేకపోయారు. ఏదో అలికిడై వెనక్కి తిరిగి చూస్తే.. ఒక్కసారిగా ఆ ఘోస్ట్​ దూసుకొచ్చింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కుకు పారిపోయారు. పాపం.. ఆ దెయ్యానికి వరుడు ముందుగా చిక్కాడు. అతణ్ని అంతమొందించి.. ఆమె కోసం వెతికింది. చివరికి ఆమెను కూడా చంపేసింది. ఇద్దరి శవాల్ని ‘ క్యాంప్​ క్రిస్టల్​ లేక్​’ అని రాసి ఉన్న సైన్​ బోర్డు దగ్గరకు లాక్కొచ్చింది. మరోసారి ఇటువైపు ఎవరైనా వచ్చారో… ఇంతే సంగతి అంటూ వార్నింగ్​ ఇచ్చింది.

వరుసగా ఈ ఫొటోలను గమనిస్తే మీకు అర్థమయ్యే స్టోరీ ఇదే. అయితే మీకు ఏదో స్టోరీ చెప్పేందుకు వీరిద్దరు ఇలా ఫొటో దిగలేదు. ఇది వీళ్లిద్దరి ఎంగేజ్​మెంట్​ ఫొటో షూట్​. ​ అదేంటీ.. ఎంగేజ్​మెంట్​  ఫొటోలంటే ఒకరినొకరు పట్టుకొని.. ఒకరి కళ్లళ్లోకి ఒకరు చూస్తూ రొమాంటిక్‌గా దిగాలి కదా? ఇదేం పోయే కాలం..! వీళ్ల పైత్యం పాడుగాను!! అని తిట్టేసుకోకండి. అందరిలా వీళ్లూ రొటీన్​గా ఫొటోలు దిగితే ఇప్పుడిలా మనమంతా చూసేవాళ్లమా? తమ ఎంగేజ్​మెంట్​ ఫొటోలు అందరూ ఆసక్తిగా చూడాలనుకున్నారు కాబట్టే.. వనెస్సా లాసన్, జోష్ మార్డెన్ అనే జంట ఇలా భిన్నంగా ఆలోచించారు.

ఇద్దరికీ హారర్​​ సినిమాలంటే ప్రాణం. అందుకే అదే థీమ్​తో ఫొటోషూట్​కు సిద్ధమయ్యారు. వారి ఆలోచనకు తగినట్లుగానే బ్రాండన్ గ్రే ఈ స్టోరీని ప్లాన్​ చేసి, కెమెరాలో బంధించాడు. ఊహించినట్లుగానే  వనెస్సా, జోష్​ల ప్లాన్​ సక్సెస్​ అయ్యింది. ఈ  ఫొటోలు ఇప్పుడు ఇంటర్​నెట్​లో తెగ హల్​చల్​ చేసేస్తున్నాయి.

Latest Updates