అధికమాసాన్నే ఫాలో అయ్యారు: ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ

అధికమాసం బతుకమ్మ పండుగపై చాలా చర్చ జరిగినా..పెత్తరమాస రోజే ఎంగిలిపూల బతుకమ్మను పేర్చారు మహిళలు. ఈసారి అధికమాసం రావడంతో వచ్చే నెల 16 నుంచి పండుగ జరుపుకోవాలని పండితులు సూచించినా.. పద్దతి ప్రకారం ఇవాళే తొలి బతుకమ్మలను పేర్చారు. పంచాంగం కంటే ఆనవాయితీ ముఖ్యమంటున్నారు మహిళలు. దీంతో సిటీలోని మార్కెట్లలో బతుకమ్మ పూలకు డిమాండ్ పెరిగింది. బతుకమ్మ పండుగపై ఎవరెన్ని చెప్పినా….ఆనవాయితీనే ఫాలో అయ్యారు మహిళలు. దీంతో సిటీ మార్కెట్ లో బతుకమ్మపూలకు డిమాండ్ ఏర్పడింది. గునుగు, తంగేడు, బంతి, గులాబీలను మాత్రమే మహిళలు కొనడంతో మిగతా పూల రేట్లు కాస్త తగ్గాయి. కేజీ బంతి పూలు పది రూపాయలుండగా…చామంతి 40 నుంచి 60 రూపాయలు, లిల్లీ కేజీ వంద, మల్లెపూలు కేజీ 120 రూపాయలు పలుకుతున్నాయి. ఇక బతుకమ్మను పేర్చేందుకు అవసరమైన గునుగు, తంగేడు, కట్ట పువ్వులకు ఫుల్ గిరాకీ ఉండటంతో రేట్లు కాస్త ఎక్కువగా ఉన్నాయంటున్నారు జనం.

అధిక ఆశ్వీయుజ మాసం వస్తుండటంతో పెద్దల అమావాస్య రోజున కాకుండా వచ్చే నెల 16 నుంచి పండుగను జరుపుకోవాలని పండితులు, తెలంగాణ జాగృతి, విశ్వహిందూ పరిషత్ ప్రచారం చేసినా…చాలా మంది  బతుకమ్మలను పేర్చి ఆడారు. పంచాంగాలు, ప్రమాణాల కంటే సంప్రదాయాలు ముఖ్యమంటున్నారు ఆడపడుచులు. గునుగు, తంగేడు, కట్లపూలు, బంతిపూలతో బతుకమ్మలను పేర్చి ఆడతామంటున్నారు. 9 రోజుల పాటు బతుకమ్మ పూలకు మంచి డిమాండ్ ఉంటుందంటున్నారు రైతులు. గతేడాదితో పోలిస్తే… కరోనా ఎఫెక్టుతో గిరాకీలు తగ్గినా బతుకమ్మ పూలు మాత్రం అమ్ముడు పోయాయంటున్నారు. పూలకు  గిరాకీ  తగ్గిందంటున్నారు. గతేడాది లాగా ఈసారి ఇతర పూల కొనుగోళ్లకు మహిళలు ఇంట్రెస్ట్ చూపించలేదు. కేవలం  బతుకమ్మ పూలు మాత్రమే  కొనుగోలు చేస్తున్నారు.

 

Latest Updates