స్నేహితుడి అద్దె గదిలో బీటెక్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

‌హైద‌రాబాద్‌: లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. స్నేహితుడి అద్దె గ‌దిలో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట కు చెందిన విజయ్ అనే బీటెక్ విద్యార్థి గత 2 రోజుల క్రితం హైద‌రాబాద్ లోని ప్రశాంత్ నగర్ లో ఉంటున్న తన స్నేహితుడి అద్దె ఇంటికి వచ్చాడు,. కానీ అక్కడ త‌న స్నేహితుడు లేనిది గమనించి అతనికి ఫోన్ చేయగా.., తాను గత 4 నెలల నుంచి త‌న ఊరిలో ఉన్నానని, గది తాళంచెవి కూడా తన వద్దే ఉందని చెప్పాడు. దీంతో విజ‌య్ తాళం పగలుగొట్టుకొని రూమ్ లోపలికి ప్రవేశించి గత రెండు రోజులుగా అందులోనే ఉంటున్నాడు.

అయితే ఇది గమనించిన పక్కింటి వాళ్లు, ఇంటి యజమానికి చెప్పారు. దీంతో ఆ యజమాని ఇంటి అద్దె అడుగుదామని ఆదివారం ఉదయం గ‌ది తలుపు కొట్ట‌గా.. విజ‌య్ ఎంత‌కీ తెరవలేదు.పక్కనే ఉన్న ఎక్సైట్ హోల్ లో నుండి చూడగా, విజయ్ ఉరి వేసుకుని ఉన్నట్టు గమనించి, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, విజయ్ మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates