మూడో ఫ్లోర్ నుంచి దూకి బీటెక్ అమ్మాయి ఆత్మహత్య

హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో దారుణం జరిగింది. హైదరాబాద్ లో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న సుస్మిత అనే అమ్మాయి అపార్టుమెంట్ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకుంది.

ఘట్ కేసర్ లోని ఏస్ ఇంజినీరింగ్ కాలేజీలో సుస్మిత ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్ లింగంపల్లిలో ఉంటోంది.

శుక్రవారం మధ్యాహ్నం తాను ఉంటున్న ఇంటి మూడో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసింది. వెంటనే సుస్మితను విద్యానగర్ లోని దుర్గాబాయ్ దేశ్ ముఖ్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. ఐతే.. చికిత్స పొందుతూ సుస్మిత చనిపోయింది.

కాలేజీ ఫీజు వ్యవహారంలో తండ్రి మందలించడంలో తొందరపాటుగా ఆమె భవనం పైనుంచి దూకి చనిపోయిందని కుటుంబసభ్యులు కన్నీరు పెడుతూ చెప్పారు.

Latest Updates