హాస్టల్ బాత్ రూంలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

హాస్టల్ బాత్ రూంలో ఆత్మహత్య చేసుకుంది ఓ ఇంజనీరింగ్ స్టుడెంట్. సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం వర్ధన్నపేట్ కు చెందిన జడ అనూష(21) కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతుంది. అనూష అదే ఊర్లోని వాసుదేవ అనే ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ చదువుకుంటుంది. శుక్రవారం హాస్టల్ బాత్ రూంలో చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు హాస్టల్ సిబ్బంది. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రైనీ ఐపీఎస్ నిఖితా పంత్ వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Latest Updates